మహేశ్ బాబు సరసన ఆమె ఫిక్స్ అయినట్టేనా..?
మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సారథ్యంలో మళ్లీ సినిమా వస్తుందనగానే అభిమానుల్లో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. 'అతడు, ఖలేజా' తర్వాత వీళ్లు చేస్తోన్న సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బజ్‌కి తగ్గట్లుగానే హీరోయిన్గా నయనతారని తీసుకొస్తున్నారట మేకర్స్.
మహేశ్ బాబు, నయనతార ఇప్పటివరకు కలిసి నటించలేదు. దీంతో ఈ జోడీ ఆడియన్స్‌కి ఫ్రెష్ లుక్ ఇస్తుందని నయన్‌ని తీసుకుంటున్నారట మేకర్స్. పైగా నయనతార ఉంటే సౌత్ మార్కెట్లో సినిమా బిజినెస్ మరింత పెరుగుతుంది. సూపర్‌స్టార్‌తో లేడీ సూపర్ స్టార్ సినిమా అనే బజ్‌తో భారీ వసూళ్లు కూడా వచ్చే అవకాశముంది.
మహేశ్ బాబు ఇప్పటికే 'సర్కారు వారి పాట' మొదలుపెట్టేశాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోంది ఈ సినిమా. బ్యాంక్ స్కామ్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్ రోల్ చాలా స్టైలిశ్గా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాతో త్రివిక్రమ్ మూవీ షూటింగ్‌ని పార్లల్గా రన్ ఫినిష్ చేస్తాడట మహేశ్. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న సినిమాలో నయనతార సూట్ అవుతుందా లేదా అనేదానిపై సినీజనాలు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. చూద్దాం.. మరి ఈ కాంబినేషన్ ఏ విధంగా వర్కవుట్ అవుతుందో. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో.