ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి, హీరోలు హీరోయిన్లు వెళ్లడం సర్వసాధారణమైపోయింది. మంచి ఆఫర్లు వస్తే హిందీ హీరో హీరోయిన్లు తెలుగులో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అదేవిధంగా ఇక్కడి వారు కూడా అటువైపుగా వెళ్లే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రం ఏ ఇండస్ట్రీకి వెళ్ళడానికి ఆసక్తి చూపరు. కొన్నిసార్లు పాత్ర ప్రాధాన్యతను బట్టి, అవకాశాలను బట్టి కీలక నటీమణులు ఇతర భాషల్లో చేస్తుంటారు. అయితే ఇప్పుడు తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ హాస్యనటుడిగా మంచి దూకుడు మీదున్న నటుడు వెన్నెల కిషోర్ కి బాలీవుడ్ నుండి క్రేజీ ఆఫర్ రావడంతో హిందీలో నటించేందుకు మన హాస్య నటుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సినిమా కోసం ఫిక్సైనట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినబడుతున్నాయి. ఆ చిత్రంలో హీరో స్నేహితుడిగా కనిపించి హిందీ ప్రేక్షకులకు తన నవ్వుల రుచి చూపించబోతున్నారట వెన్నెల కిషోర్. ఇక టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈ హాస్య రథసారధి పరుగులు తీస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు తన సినిమాలో తప్పకుండా నటించాలి అని కోరడంతో కాదనలేక పోయాడట వెన్నెల కిషోర్. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. ఒకవేళ వెన్నెల కిషోర్ బాలీవుడ్ చిత్రంలో నటించేది నిజమే అయితే.. తన టాలెంట్ తెలిసిందే కాబట్టి అక్కడ కూడా అవకాశాలు అతనిని వెతుక్కుంటూ వస్తాయని అప్పుడు తెలుగు ప్రేక్షకుల పరిస్థితి ఏమిటంటూ కొందరు ఊహిస్తున్నారు.
అయితే ఆ నటుడు ఎవ్వరో, నటించబోయే సినిమా ఏమిటో ఇంకా తెలియరాలేదు. ఇప్పటి వరకు ఇలా జరిగింది లేదు . కానీ ఈ సారి జరిగితే మాత్రం బాగుంటుంది. ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం వెన్నెల కిషోర్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.