ప్రేమకావాలి సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు స్టార్ కిడ్ ఆది సాయి కుమార్. అందులో తన నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు ఈ యువ కథానాయకుడు. కే విజయభాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో తన నటనకు గాను ఆది విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఈ సినిమాలో ఆది సరసన ఇషా చావ్లా హీరోయిన్ గా నటించింది. కమర్షియల్ గా కూడా ఈ మూవీ మంచి హిట్ అవడంతో ఆదికి గొప్ప ఆదరణ లభించింది. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకొని వారి ప్రేమను పొందాడు హీరో ఆది. ఆ తర్వాత ఇతను నటించిన లవ్లీ చిత్రం కూడా హిట్ ను అందుకుంది. అయితే అంతా సరిగా ఉంది అనుకునే సమయంలోనే వరుస అపజయాలు ఆదిని నిరాశ పరిచాయి.
ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. ఇటీవలే ఈ హీరో నుండి వచ్చిన శశి మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం వీరభద్రం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి కిరాతక అనే టైటిల్ ను ఫైనల్ చేశారు మేకర్స్. అయితే ఇదిలా ఉండగా తనయుడు కెరీర్ కోసం ఓ మంచి కథను సెలెక్ట్ చేశారట సాయి కుమార్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్న ట్లు సమాచారం.
ఇందులో సాయి కుమార్ కొడుకు కోసం రంగంలోకి దిగనున్నారట. ఈ చిత్రంలో కీలక మలుపు తిప్పే పాత్రలో సాయి కుమార్ కనిపించబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.