అదెలా సాధ్యం.. నిరాశలో తలైవి నిర్మాతలు..?
కానీ ఈ మూవీపై అటు ఉత్తరాన, ఇటు దక్షిణాన భారీ అంచనాలు ఉన్నాయని చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కావడంతో తమిళ్‌లో భారీ డిమాండ్ ఉంది. అందుకే ఈ సినిమాకు ఖర్చు చేయడానికి నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదట. తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమాకి మార్కెట్ పరంగా బాగా కలిసొచ్చేలా ఉందని టాక్.
మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘటనలు, బాల్యం నుంచి సీఎం వరకు ఆమె ప్రస్థానం ఈ మూవీలో కనిపించనున్నాయి. సినిమా ఇండస్ట్రి నుంచి ప్రస్థానం మొదలు పెట్టిన జయలలిత ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు, జైలు జీవితంపై దర్శకుడు తెరక్కించాడు. ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు ఇతర భాషలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగులో కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజేశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను బయోపిక్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే తమిళ రాజకయాలు తెలుగు ప్రజలపై కూడా ఎన్నో ప్రభావాలను చూపాయి. ఎం.స్ ధోనీ, మాజీ ప్రధాన మన్మోహన్ సింగ్ లాంటి వారి జీవిత చర్రితగా బయోపిక్‌లు తెరకెక్కిస్తున్నారు. జయలలిత జీవత చరిత్రగా వస్తున్న మూవిని పేక్షకులు ఏవిధంగా ఆదరిస్తారో వేచి చూడాలి.