మరో హిస్టోరికల్ స్క్రిప్ట్ తో కళ్యాణ్ రామ్..?
యువ దర్శకులకు అవకాశాలు ఇస్తూ... హిట్లు కొట్టే కల్యాణ్ రామ్ కి గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దీంతో ఈ హీరో తన ఫామ్ కోల్పోయాడని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కల్యాణ్ చేస్తున్న.. చేయాల్సిన అన్ని సినిమాలు కూడా కొత్త దర్శకులతోనే కావడం విశేషం. కొంతకాలంగా కల్యాణ్ రామ్ సరైన హిట్ ఇచ్చే దర్శకుడి కోసం వెయిట్ చేస్తున్నారు. ఎల్లప్పుడు ప్రయోగాలు చేసే హీరో కాబట్టి కొత్త దర్శకులు కూడా ఈయనకు కథ వినిపించడానికి పరుగులు పెడుతున్నారట. రాజేంద్ర అనే కొత్త డైరెక్టర్ చెప్పిన లైన్ విని ఇంప్రెస్ అయిన ఈ హీరో తనతో మూవీని చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త మూవీలో ఈ హీరో మూడు పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మూవీని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుందట.
ఈ ఏడాదే ఈ మూవీని పట్టాలెక్కించడంతో పాటు పూర్తి చేయాలని భావిస్తున్నారట. కల్యాణ్ రామ్ ప్రస్తుతం మరో నూతన దర్శకుడితో కలిసి బింబిసార అనే హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిందని చెబుతున్నారు. ఇప్పటికే రిలీజయిన పోస్టర్ ఫస్ట్ లుక్ లో కల్యాణ్ రామ్ ఇరగదీసాడు. కాగా.. అభిషేక్ నామా అనే నిర్మాత చేస్తున్న మరో చిత్రంలో నూ కల్యాణ్ రామ్ నటిస్తున్నాడు. 1950 బ్యాక్ డ్రాప్ లో ఈ కథ ఉండనుందని తెలస్తుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన విశేషాలు రిలీజవుతాయని అందరూ అనుకుంటున్నారు.