మూడు సినిమాలు.. మూడు డిఫరెంట్ జానర్లు.. విక్టరీ వెంకటేష్ సత్తా ఏంటో చూపుతాడా..?

shami
విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మంచి ఫాం లో ఉన్నాడు. ఎఫ్2, వెంకీమామ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్3, దృశ్యం 2, నారప్ప సినిమాలు చేస్తున్నారు. ఈ 3 సినిమాలతో 3 డిఫరెంట్ జానర్లతో సినిమాలు చేస్తున్నారు వెంకటేష్. ఎఫ్2 హిట్ అవగా అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఎఫ్3 సినిమా చేస్తున్నారు. ఎఫ్2 ని మించే కామెడీ మూవీగా ఈ సినిమా చేస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి మరోసారి హంగామా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రేక్షకులను నవ్వించడమే వారి ముఖ్య ఉద్దేశంగా ఈ సినిమా వస్తుంది.
ఇక మళయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాను తెలుగులో రీమేక్ చేశాడు వెంకటేష్. ఈమధ్యనే అక్కడ దృశ్యం 2 కూడా వచ్చింది. అది కూడా హిట్ అవడంతో ఇప్పుడు ఆ సీక్వల్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు వెంకటేష్. దృశ్యం 2 అదే టైటిల్ తో వస్తుంద్. ఈ సినిమాను మాత్రుక దర్శకుడు జీతు జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్నారు. దృశ్యం కి కొనసాగింపుగా ఈ సినిమా వస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా దృశ్యం 2 అదరగొట్టబోతుందని చెప్పొచ్చు.
కోలీవుడ్ లో సూపర్ హిట్టైన అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా చేస్తున్నారు వెంకటేష్. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భూ వివాదాలు, జాతి వివక్ష నేపథ్యంతో వస్తుంది. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి తెలుగులో కూడా భారీ అంచనాలతో వస్తుంది. రాబోయే 3 సినిమాలు 3 జానర్లతో వెంకటేష్ దగ్గుబాటి ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్టైన్ చేసేలా ఉన్నాడు. ఎఫ్3 సినిమా థియేటర్లో వస్తుందేమో కాని దృశ్యం 2, నారప్ప సినిమాలు ఆల్రెడీ ఓటిటి రిలీజ్ కన్ ఫర్మ్ చేశారు. జూలై 24న నారప్ప సినిమా అమేజాన్ ప్రైం లో రిలీజ్ ప్లాన్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: