ఎక్కడ పెంచాలో కాదు.. ఎక్కడ తగ్గించాలో తెలిసినవాడు శర్వానంద్..!
సినిమాకు ఐదారు కోట్ల దాకా తీసుకుంటున్న శర్వానంద్ మహా సముద్రం సినిమా ప్రొడక్షన్ కు హెల్ప్ అవుతుందని ఆ సినిమాకు మాత్రం కేవలం 2 కోట్లు మాత్రమే చాలని చెబుతున్నాడట. సినిమా పూర్తి చేసేందుకు సహకరిస్తూ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నా బిజినెస్ టైం లో అంతకు డబుల్ తీసుకుంటాడని అంటున్నారు. అలా అయినా సరే ముందు సినిమా పూర్తి చేయడానికి శర్వానంద్ సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. తెలుగులో ఉన్న యువ హీరోల్లో శర్వానంద్ కూడా తన మార్క్ చూపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ ఇయర్ ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన శ్రీకారం సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవలేదు. సినిమా కంటెంట్ బాగున్నా ఎందుకో ఆడియెన్స్ దాన్ని రిసీవ్ చేసుకోలేదు. అందుకే కంటెంట్ ఉన్న సినిమాలనే తీసుకుంటూ వాటి కథల విషయంలో జాగ్రత్త పడుతున్నాడు శర్వానంద్. ఈ సినిమాతో పాటుగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఈ రెండు సినిమాలతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు యువ హీరో. మహా సముద్రం సినిమాను ఆరెక్స్ 100 అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ కూడా మరో హీరోగా నటిస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ గా మహా సముద్రం సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అదితి రావు హైఅరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.