ప్రభాస్ తో సాహో అన్నాడు.. చిరు ఛాన్స్ కాదనుకున్నాడు.. సుజిత్ కనబడుట లేదు..!

shami
తొలి సినిమా రన్ రాజా రన్ తో డైరక్టర్ గా తన టాలెంట్ చూపించిన సుజిత్ తన నెక్స్ట్ సినిమా బాహుబలి ప్రభాస్ తో చేశాడు. సాహో అంటూ సత్తా చాటుతాడని అనుకున్న సుజిత్ కాస్త చతికిలపడ్డాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా అనగానే తారాస్థాయి అంచనాలు ఉండగా తెలిసిన కథనే ఆకట్టుకోలేని కథనంతో తెరకెక్కించాడు సుజిత్. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన సాహో సౌత్ ఆడియెన్స్ ను ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ ను నిరాశపరచింది.
బాహుబలి మేనియాలో ఉన్న బాలీవుడ్ ఆడియెన్స్ మాత్రం సాహో సినిమాను హిట్ చేశారు. రిలీజ్ చేసింది పాన్ ఇండియా అయినా సుజిత్ కు మళ్లీ రావాల్సింది తెలుగు ఛాన్సే. సాహో తర్వాత వెంటనే మరో సినిమా చేస్తాడని అనుకున్న యువ దర్శకుడు సినిమా చేయలేదు సరికదా కనీసం సినిమా ప్రకటించలేదు. ఈమధ్య మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చినా ఆ ఛాన్స్ కూడా కాదనుకున్నాడని తెలిసింది.
సాహో తర్వాత కొన్నాళ్లు వార్తల్లో ఉన్న సుజిత్ ఇప్పుడు కనిపించడం లేదు. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ కు ఏదైనా స్క్రిప్ట్ రాస్తున్నాడా లేక ఇంకా పెళ్లి మూడ్ లోనే ఉన్నాడా అన్నది తెలియదు కాని సుజిత్ సినిమాపై రన్ రాజా రన్ మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. మళ్లీ రన్ రాజా రన్ కాంబోలోనే శర్వానంద్ ఓ సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. సుజిత్ అలాంటి కాంబినేషన్ అయినా ఫిక్స్ చేసుకుని మళ్లీ తను ట్రాక్ లోకి రావాలని కోరుకుంటున్నారు ఆడియెన్స్. అయితే సుజిత్ మాత్రం మరో మాస్టర్ ప్లాన్ తో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రభాస్ తర్వాత మళ్లీ పెద్ద స్టార్ తోనే సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడట సుజిత్. ఈసారి టార్గెట్ కూడా పెద్దదిగా పెట్టుకుని మరి దిగుతున్నాడని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: