హీరో హీరోయిన్స్ అభిమానుల పాదయాత్రలతో హోరెత్తిపోతున్న ఇండస్ట్రీ !

Seetha Sailaja

ఒకప్పుడు తాము అభిమానించే హీరోల సినిమాలు విడుదలైనప్పుడు వీరాభిమానులు తమ హీరోల కటౌట్ లకు పాలాభిషేకాలు పూజలు చేస్తూ హారతులు ఇచ్చేవారు. తమ రక్తంతో తమ హీరోల కటౌట్ లకు రక్త తిలకాలు దిద్దుతూ నానా హడావిడి చేసేవారు.  


ఇప్పుడు ట్రెండ్ మారడంతో వీరాభిమానులు తమ హీరోలను హీరోయిన్స్ ను చూడటానికి వందల కిలోమీటర్ల పాదయాత్రను చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోనూ సూద్ కోసం 700 కిలోమీటర్ల పాదయాత్ర రామ్ చరణ్ కోసం 231 కిలోమీటర్ల పాదయాత్ర హీరోయిన్ రష్మిక కోసం 900 కిలోమీటర్ల యాత్ర అల్లు అర్జున్ కోసం 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వీరాభిమానుల గురించి వార్తలు చదివినప్పుడు అభిమానం ఏవిధంగా తారాస్థాయికి చేరుకుందో అర్థం అవుతుంది.


ప్రస్తుతం కరోనా పరిస్థితులు కొనసాగుతున్నా వాటిని లెక్కచేయకుండా కొనసాగుతున్న ఈలేటెస్ట్ ట్రెండ్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆశ్చర్యపోతున్నాయి. తన అభిమాన నటుడు ముంబైలో ఉన్నాడని తెలిసి హైదరాబాద్ నుంచి కాలినడక 700కిలోమీటర్లు నడచి వెళ్లి సోనూ సూద్ ను కలిసిన వీరాభిమాని వెంకటేష్ కు సంబంధించిన వార్తలు జాతీయమీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యాయి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ముగ్గురు వీరాభిమానులు జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి నడుచుకుంటూ హైదరాబాద్ వచ్చి ఏకంగా చరణ్ కు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈలిస్టులో అల్లు అర్జున్ అభిమానులు కూడ చేరిపోయారు. బన్నీ కోసం ఒక వీరాభిమాని మాచర్ల నుండి కాలినడకన వస్తున్నాడు అని తెలుసుకుని బన్నీ అతడి కోసం కారును పంపి అతడిని ఆ కారులో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువచ్చిన తరువాత ఆ అభిమానికి బన్నీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో తీయించుకుని ఒక చిన్న మొక్క బహుమతిగా ఇస్తే ఆ అభిమాని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అదేవిధంగా రష్మిక కోసం ఆకాష్ త్రిపాఠి అనే యువకుడు ఏకంగా బెంగళూరు వెళ్లాడు.

 అయితే ఆమె ముంబాయ్ లో ఉందని తెలుసుకుని అక్కడ నుండి లారీలో ముంబాయి వెళ్ళినప్పుడు అక్కడ లాక్ డౌన్ కొనసాగుతూ ఉండటంతో అతడు నానా పాట్లు చివరికి రాష్మిక ను కలిసి ఆమెతో ఫోటో తీయించుకుని ఆ ఫోటో ఇచ్చిన ఆనందంతో తిరిగి హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఈవార్తలు వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడ అతడి కోసం పాదయాత్రలు చేసే పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యం లేదు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: