నాన్న ప్రేమకు నిదర్శనం ఈ చిత్రాలు..

Divya

మన దర్శక,రచయితలు కథలను ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతారో చెప్పడం చాలా కష్టం. కొన్ని కథలు యాక్షన్ పరంగా వుంటే, మరికొన్ని కథలు లవ్ డ్రామా పరంగా తీస్తూ ఉంటారు. మరి కొన్ని కథలు  ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా మన ముందుకు వస్తే, మరికొన్ని సినిమాలు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమను, బంధాల విలువలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఉంటారు. ఇక అలా వచ్చిన ఎన్నో సినిమాలలో తండ్రి ప్రేమను కళ్లకు కట్టినట్టుగా చూపించిన సినిమాల గురించి ఇక్కడ ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..


1. నువ్వు నాకు నచ్చావ్:
విక్టరీ వెంకటేష్ హీరోగా, ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్. ఇక  మంచి కామెడీతో పాటు ఫాదర్ సెంటిమెంట్ ను కూడా అద్భుతంగా పండించారు. నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తీసిన సినిమా కథ ఇది. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలు అమెరికా వెళ్ళి డబ్బులు పంపిస్తే హాయిగా కూర్చొని తినాలని కొంతమంది అనుకుంటే, మరి వారి పిల్లలు ఏమో దగ్గరుండి వాళ్ల తల్లిదండ్రులను చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇక దీనినే తెరపైకి తీసుకొచ్చి అద్భుతంగా చూపించారు మన దర్శకులు.

2. బొమ్మరిల్లు:
తెలుగు సినీ పరిశ్రమలో ఫాదర్ సెంటిమెంట్ కి నిదర్శనం బొమ్మరిల్లు సినిమా. తండ్రికి, కొడుకు మీద ప్రేమ ఎంత ఉంది అంటే, ఆఖరికి తన కొడుకు ఏం తినాలి..? ఎలాంటి బట్టలు వేసుకోవాలో  కూడా తండ్రి డిసైడ్ చేస్తాడు. ఇక తండ్రి మాటకి ఎదురు చెప్పలేక కొడుకు చివరి వరకు మదనపడుతూ.. ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఈ సినిమా ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల మదిని దోచుకుంది.

3. నాన్నకు ప్రేమతో:
చావు బ్రతుకుల్లో ఉన్న తండ్రి కోరికను తన కొడుకు ఎలా తీర్చగలిగాడు అనే  కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

4. సన్నాఫ్ సత్యమూర్తి:
తన తండ్రి అందరి కంటే గొప్పవాడు అని గట్టిగా నమ్మే కొడుకు, తన తండ్రి గురించి ప్రతి ఒక్కరూ మంచిగా మాట్లాడుకోవాలి అని తపన పడతాడు. అలా అనుకోవాలని కోట్ల రూపాయల ఆస్తిని కూడా వదులుకుంటాడు.

5. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే:
ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు తండ్రిగా, ఆయన కొడుకుగా వెంకటేష్ నటించారు. హీరోయిన్ గా త్రిష నటించింది. ఇక తండ్రి మాటను కాదనలేక ఇష్టపడిన అమ్మాయిని కూడా వదులుకున్నాడు వెంకటేష్. అంతేకాదు తండ్రీ కొడుకుల మధ్య సాగే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా మెప్పించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: