విజయ్ సేతుపతి మ్యానియాలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ !

Seetha Sailaja
బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ టాప్ హీరోలు ఈమద్య కాలంలో ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్లుగా చేస్తూ వస్తున్నారు. కొంతమంది మీడియం రేంజ్ హీరోలు అయితే ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ తమ కెరియర్ ను బిల్డ్ అప్ చేసుకుంటున్నారు. అదేవిధంగా    ఇండస్ట్రీలోని క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడ సంవత్సరానికి 5 నుండి 10 సినిమాలు మించి చేయలేక పోతున్నారు.

క్రేజీ హీరోయిన్స్ కూడ సంవత్సరంలో అన్ని భాషలు కలుపుకుని 5-6 సినిమాలకు మించి చేయలేకపోతున్నారు. అయితే విజయ్ సేతుపతి ఇప్పుడు దేశ వ్యాప్తంగా 25 మూవీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం తమిళం తెలుగు హిందీ అంతేకాకుండా ఇతర భాషల్లో కూడ విజయ్ సేతుపతి సినిమాలు చేస్తున్నాడు. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు అదేవిధంగా తమిళ టీవీకి సంబంధించి టివి షోలు ఒకేసారి చేస్తున్నాడు.ఈ ప్రాజెట్ల సంఖ్య అన్నీ కలుపుకుంటే 25 ప్రాజెక్ట్స్ వరకు ఉంటాయని ఒక అంచనా రావడంతో విజయ్ సేతుపతి చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్ సంఖ్య ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డుగా మారింది అని అంటున్నారు. విజయ్ సేతుపతి ప్రస్తుతం కొన్ని సొంత సినిమాలను కూడ తీస్తున్నాడు. సినిమాలు తీయడమే కాకుండా ఇతర సినిమాలకు రచన సహకారం అందిస్తున్నాడు.

ఇలా వివిధ రంగాలలో ఈ విలక్షణ నటు చూపెడుతున్న ప్రతిభా పాటవాలు ఇతడి ఇమేజ్ ని జాతీయ స్థాయికి తీసుకువెళ్ళి అతడిని నేషనల్ సెలిబ్రిటీగా మార్చి వేసింది. సినిమా రంగానికి సంబంధించి అన్ని విభాగాలలోను ప్రవేశం ఉండతంతో విజయ్ సేతుపతి చాల తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు డేట్స్ఇస్తే చాలు భారీ పారితోషికం ఇస్తామని నిర్మాతలు చేపుతున్నా తన పాత్ర నచ్చకపోతే ఎలాంటి భారీ ప్రాజెక్ట్ ను అయినా విజయ్ సేతుపతి తిరస్కరిస్తున్నాడు అంటే అతడు ఎలాంటి పెర్ఫెక్షనిస్ట్ అన్న విషయం అర్థం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: