టాలీవుడ్ కు రష్మికని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరో తెలుసా..?

shami
కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న భామ వరుస అవ్కాశాలతో అదరగొట్టేస్తుంది. అమ్మడు సినిమా చేస్తే హిట్టే అనేంతగా ఉంది క్రేజ్. సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో లాస్ట్ ఇయర్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. అందుకే నేషనల్ క్రష్ గా మారింది. తన టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్న రష్మిక తెలుగులో నటించడానికి గల కారణం ఎవరన్నది చెప్పింది. తన తండ్రి మదన్ వల్లే తెలుగులో నటిస్తున్నానని అన్నది రష్మిక.
తెలుగులో ఛలో అవకాశం రాగానే తెలుగు సినిమ పెద్ద ఇండస్ట్రీ అని మొదట భయపడ్డదట రష్మిక ఇక్కడ తను రాణించగలుగుతానా లేదా అన్న భయం వేసిందట. కాని రష్మికకు ఉన్న భయాలన్ని పోగొట్టారట ఆమె ఫాదర్. తెలుగు ఇండస్ట్రీ చాలా మంచిందని. అక్కడ అవకాశం రావడం లక్ అని చెప్పారట. తెలుగు సినిమాలు ఆయన చూస్తుంటారని చెప్పింది రష్మిక. సో రష్మిక తెలుగులో నటించడానికి భయపడితే వెనక ఉండి ప్రోత్సహించింది ఆమె తండ్రి అని తెలుస్తుంది.
ఆయన అలా ఆరోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబట్టే రష్మిక ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. టాలెంట్ ఉన్న వారికి తెలుగు చల చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తాయి. ఇంతమంది ప్రేక్షక అభిమానం చూసి ఉబ్బితబ్బిబ్బైపోతుంది అమ్మడు. తెలుగులో ఈ అవకాశాలన్ని నాన్న ఆరోజు ధైర్యం చెప్పబట్టే అని ఫాదర్స్ డే నాడు ఆయనతో దిగిన పిక్ ను షేర్ చేసింది రష్మిక. తెలుగులో రష్మిక మరో ఐదారేళ్ల దాకా కెరియర్ కు తిరుగు లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో అమ్మడు నటిస్తుంది. ఆ సినిమాలో విలేజ్ గాళ్ గా కనిపిస్తుందట రష్మిక. ఇదే కాదు అమ్మడి లిస్ట్ లో మరో రెండు స్టార్ సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది. సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ కూడా అలరిస్తుంది కన్నడ భామ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: