మమ్మీ హీరో.. డమ్మీ హీరో అయ్యాడే..

Divya

వయసులో ఉన్నప్పుడు సినిమాలలో ఎంతో అందంగా కనిపించిన హీరోలు , తాము వయస్సు వచ్చిన తర్వాత కూడా అంతే అందంగా కనిపించాలని అనుకుంటుంటారు. అందుకు తగ్గట్లుగానే ఎంతో అందంగా రడీ అయి వస్తారు. అయితే కొంతమంది హీరో, హీరోయిన్లు మాత్రం తమ శరీరంలో జరిగే మార్పులకు..చాలా భిన్నంగా తయారు అవుతున్నారు. అలా ఒక హాలీవుడ్ స్టార్ హీరో ను చూసి కంగుతిన్నారు అభిమానులతో పాటు  ప్రేక్షకులు కూడా.. అయితే ఇంతకు ఆ హీరో ఎవరో చూద్దాం.

సినిమాలలో తన క్యారెక్టర్ లో బాగా ఇమిడిపోయి నటించే హీరోలలో "బ్రెండన్ ఫ్రాజర్" కూడా ఒకరు. ఈయన మమ్మీ సినిమా లో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ హీరో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. జార్జ్ అఫ్ ది జంగిల్, మమ్మీ వంటి సినిమాలలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తుండిపోయేలా నటించారు. అప్పట్లో ఆయనకు అభిమానులు కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎక్కువగానే ఉండేవారు. ఇప్పటికీ కూడా ఈయన చేసిన నటన ప్రేక్షకులతో నిలిచిపోయేటట్టు నటించడం విశేషం..

ఈ హీరోకి ప్రస్తుతం 52 ఏళ్లు కావస్తుండడంతో ఒక ప్రోగ్రాంలో సడన్ గా  ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆయన అలా గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో, అక్కడున్న ఫోటోగ్రాఫర్లు ఆయనను  అంతగా పట్టించుకోలేదు. చివరికి.. అక్కడున్న ఒక నటుడు ఆయనను మాట్లాడించడం తో.. అప్పుడు అసలు విషయం తెలుసుకొని, ఫోటోలు తీశారు. అయితే బ్రెండన్ ఫ్రాజర్ అలా మారిపోవడానికి..తనకున్న ఆరోగ్య సమస్యలే కాకుండా, కొద్ది సంవత్సరాల క్రితం ఆయన చేయించుకున్న ఆపరేషన్ వల్ల ఇలా మారిపోయాడని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ హీరో "ది వెల్"అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఏ సినిమాలో హీరో కి  తండ్రి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఏది ఏమైనా ఈ హీరో ఇంతలా మారిపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. బ్రెండన్ ఫ్రాజర్ మమ్మీ సినిమా ద్వారా హీరో గా బాగా పాపులారిటీ అందుకున్న ఈయన, ఇప్పుడు తండ్రి పాత్రలో నటించి ,మరింత పాపులారిటీ అందుకోవాలని మనం కూడా కోరు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: