క్రాక్ ఇచ్చిన కిక్.. యాక్షన్ సీన్స్ హైలెట్ గా ఖిలాడి..!
సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. అయితే సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మాస్ అండ్ కమర్షియల్ మూవీగా వస్తున్న ఈ సినిమా యాక్షన్ సీన్స్ హైలెట్ గా ఉండేలా సెట్ చేస్తున్నారట. రవితేజ డ్యుయల్ యాక్షన్ మాస్ రాజా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందని అంటున్నారు. రమేష్ వర్మతో వీర సినిమా చేశాడు రవితేజ ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తో ఖిలాడి సినిమా చేస్తున్నారు. రాక్షసుడు హిట్ తో జోష్ లో ఉన్న రమేష్ వర్మ ఖిలాడితో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ మరో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి క్రాక్ తో హిట్ ఫాం లో ఉన్న రవితేజ ఖిలాడితో కూడా మరో హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమా తర్వాత శరత్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇదే కాకుండా నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో కూడా సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుందని తెలుస్తుంది.