షాకింగ్: సుబ్బరాజుతో కాజల్ వెబ్ సిరీస్... ?

VAMSI
కరోనా కాలంలో లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్నీ మూతపడడంతో ఓటిటిల జోరు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. కోవిడ్ సమయంలో లో ఓ టి టి వేదికలకు జనం బాగా అలవాటు పడడంతో వీటి డిమాండ్ ఎంతగా పెరిగిందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్ లు సైతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ  ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అయితే ఇక్కడ ఇస్తున్న పారితోషికాలు కూడా స్టార్ హీరోయిన్ లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత అక్కినేని, కాజల్ అగర్వాల్ , తమన్నా భాటియాలు వెబ్ సిరీస్ ల లోనూ, ప్రముఖ షోలతోనూ ఒటిటి  వేదికపై సందడి చేస్తున్నారు.  అయితే హాట్ స్టార్‌లో 'లైవ్ టెలికాస్ట్' వెబ్ సిరీస్ తో కాజల్ అగర్వాల్ మన ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈమె మరో వెబ్ సిరీస్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు అది దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు చెబుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నట్లు సమాచారం. ఇందులో కాజల్ తో పాటు, ప్రముఖ నటుడు సుబ్బరాజు కూడా కనిపించనున్నట్లు   గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ కు కాజల్ భారీగానే రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. ఈ వెబ్ సిరీస్ కూడా హాట్ స్టార్ లోనే స్ట్రీమ్  కానున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందులోనూ ఈ వెబ్ సిరీస్ లో కాజల్ అగర్వాల్ కాలేజీ గర్ల్ గా అల్లరి చేయనున్నారట.
 
అయితే ఇది ఎంతవరకు నిజం అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న‘ఆచార్య’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు కింగ్  నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. ఇప్పటికే తమన్నా వరుస పెట్టి వెబ్ సిరీస్ లు చేస్తుండగా, ఇక ముందు ముందు ఇంకెంతమంది వెబ్ సిరీస్ ల పట్ల ఆకర్షితులవుతారో తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: