అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ ని చేసిన సినిమా ఆర్య.. ప్రేమకథ లలోనే వెరైటీ..!!
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దిల్ రాజు నిర్మాతగా దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 36 కోట్ల వసూళ్లను సాధించి అప్పట్లో రికార్డులను సృష్టించింది. 2004 వ సంవత్సరం మే 7న విడుదలైన ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. గంగోత్రి సినిమా ద్వారా విజయం సాధించిన తన లుక్ తో అల్లు అర్జున్ ఎన్నో విమర్శలను పొందాడు. అయితే వాటన్నిటినీ తుడిచేస్తు అల్లు అర్జున్ ఆర్య సినిమాలో కనబడిన తీరు తో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు.
అప్పటికే వేరే అబ్బాయిని ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తాడు హీరో. తాను వేరే అతనిని ప్రేమిస్తున్నాను అని ఎంత చెప్పినా వినని హీరో ఫీల్ మై లవ్ అంటూ ఆమె వెంట పడతాడు. ఒకానొక సమయంలో హీరోయిన్ కి ఆపద ఉన్న టైం లో హీరోయిన్ నీ కాపాడడానికి ప్రేమికుడు సైతం ముందుకు రాకపోగా హీరో తన ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడతాడు. చివరికి హీరోయిన్ హీరో ని ప్రేమిస్తుందా అనేదే సినిమా కథ. అప్పటివరకు ప్రేమ కథ చిత్రాలు ఇంత వైవిధ్యభరితంగా తెరకెక్కిన సినిమాలు రాలేదు. ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ అనిపించేసరికి ప్రేక్షకులు ఈ సినిమా కు కనెక్ట్ అయ్యి సూపర్ హిట్ చేశారు.