ఆ సినిమాలో స్పెషల్ గెస్ట్ గా అదరకొట్టిన ప్రభాస్..?

frame ఆ సినిమాలో స్పెషల్ గెస్ట్ గా అదరకొట్టిన ప్రభాస్..?

Suma Kallamadi
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక బాలీవుడ్ చిత్రంలో స్పెషల్ గెస్ట్ గా కనిపించి అదరగొట్టారు. ఆ సినిమా ఏంటో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం. అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా, యామి గౌతం ప్రధానపాత్రలలో నటించిన "యాక్షన్ జాక్సన్" సినిమాలో ప్రభాస్ స్పెషల్ రోల్ లో నటించారు. ఈ సినిమాకి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహించారు. 2014 డిసెంబర్ 5వ తేదీన విడుదలైన "యాక్షన్ జాక్సన్" సినిమాలోని 'సూర్య అస్త్ పంజాబీ మస్త్' పాటలో ప్రభాస్ కనిపించారు. ఈ క్లబ్ డాన్స్ లో అజయ్ దేవగన్ తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటుంటారు. ఐతే ఈ పబ్ లో సోనాక్షి సిన్హా ఒక స్టేజ్ మీదకి విచ్చేసి ప్రభాస్ తో కలిసి నాట్యం చేస్తుంది. వారిద్దరు కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీద కేక పుట్టించారు.
ఈ పాటలో ప్రభాస్ చేసిన అదిరిపోయే స్టెప్పులకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఈ పాటలో ఆయన చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. సోనాక్షి సిన్హా తో ఉత్సాహంగా డాన్స్ చేయడంతో పాటు ఒక కోల్డ్ డ్రింక్ ఆయన తీసుకొని తాగుతూ కనిపించారు. అయితే ఇదే పాటలో కబీర్ సింగ్ ఫేమ్ షాహిద్ కపూర్ కూడా స్పెషల్ గెస్ట్ గా కనిపించారు. ఈ పాట వీక్షించాలనుకునేవారు యూట్యూబ్ లో  "ప్రభాస్ ఇన్ యాక్షన్ జాక్సన్ మూవీ" అని టైప్ చేసి సెర్చ్ చేస్తే సరిపోతుంది.
అయితే యాక్షన్ జాక్సన్ చిత్రం మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాకి రీమేక్ అని చెప్తున్నారు కానీ ప్రభుదేవా చాలా వరకు ఈ సినిమా కథను చేంజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో అజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడి అద్భుతమైన యాక్షన్ స్టంట్స్ చేశారు. కానీ ఆశించదగ్గ స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. ఇకపోతే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కంటే ముందుగానే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: