ఈ బాలీవుడ్ హీరోయిన్లు అప్పుడలా.. ఇప్పుడిలా..!

Suma Kallamadi
సినిమాల్లో నటించే నటీనటుల ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసే అవకాశం ప్రేక్షకులకు ఉంటుంది. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎలా ఉండేవారు.. యువకుడిగా ఎలా ఉన్నారు.. మిడిల్ ఏజ్ మెన్ గా ఎలా ఉన్నారు అనేది టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత పాపులర్ నటీనటులు తమ ఫస్ట్ ఫిల్మ్ లో ఎలా కనిపించారో తెలుసుకుంటే ఆశ్చర్య పోవాల్సిందే. ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులు తమ తొలి చిత్రం తర్వాత బాగా మారిపోయారు. కొందరు స్టైలిష్ గా మారితే మరికొందరు మరింత అందం గా మారారు. కొందరు లావుగా.. కొందరు సన్నగా.. ఇలా చెప్పుకుంటూ పోతే వారి శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే ఈ ఆర్టికల్ లో ఫస్ట్ ఫిల్మ్ నుంచి రీసెంట్ ఫిల్మ్ వరకు గుర్తుపట్టలేనంత స్థాయిలో మారిన బాలీవుడ్ హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.

1. కాజల్ దేవగన్

బాలీవుడ్ అగ్రతార కాజోల్ గురించి తెలియని భారతీయ ప్రేక్షకులంటూ ఎవరూ ఉండరు. తనూజా ముఖర్జీ కూతురైన కాజోల్ బెఖుడి(1992) సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ సమయంలో ఆమె పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఆమె బాజిగర్(1993) సినిమాతో ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రంలో ఆమె ఎలా కనిపించారో పైన మేము ఇచ్చిన ఫోటోలో మీరు చూడొచ్చు. అయితే ఆమె రీసెంట్ పిక్ కూడా మీరు చూడొచ్చు. ఈ రెండు చిత్రాల్లో ఆమె ఎంతలా మారిపోయారో మీరు గమనించవచ్చు.


2. అలియా భట్

హైవే, ఉడ్తా పంజాబ్, రాజీవ్ వంటి చిత్రాల్లో నటించి మంచి యాక్టర్ గా పేరొందిన అలియా భట్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" చిత్రం నుంచి ఇప్పటి వరకు ఎంతలా మారిపోయారో పైన ఫోటోలో చూడొచ్చు.


3. శిల్పా శెట్టి

షారుక్ ఖాన్ హీరోగా నటించిన బాజిగర్ సినిమాతో శిల్పా శెట్టి వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె తన మొదటి చిత్రం నుంచి ఇప్పటి వరకు చాలా మారిపోయారు. అయితే అప్పుడు ఎలాంటి ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు.


4. అనుష్క శర్మ

రబ్ నే బనాదీ జోడీ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుష్క శర్మ తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచేశారు. అప్పట్లో కళ్లార్పకుండా అలానే చూస్తూ ఉండిపోవాలనిపించే అందంతో ఆమె ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆమె అందానికి ప్రముఖ సెలబ్రిటీలు సైతం పారవశ్యానికి గురయ్యారంటే అతిశయోక్తి కాదు. అయితే ఆమె తన లిప్స్ కి సర్జరీ చేసుకున్నారని ఆ తర్వాత కాస్త అందాన్ని కోల్పోయారని అంటుంటారు. ఏదేమైనా పైన ఫోటోలో మనం గమనిస్తే ఆమె మొదట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు.


5. ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రా సినీ జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమైనదిగా చెప్పుకోవచ్చు. ఆమె తన సినీ కెరీర్ లో చాలాసార్లు శరీరాకృతిని మార్చుకున్నారు. ఆమె మొదట్లో ఎలా ఉండేవారో పైన ఫోటోలో చూడొచ్చు.


ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తమ మొదటి ఈ సినిమాతో పోలిస్తే ఇప్పుడు చాలా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: