అక్కినేని నాగర్జున.. పేరు వింటేనే అమ్మాయిల గుండెల్లో ఏదో తెలియని గుబులు కలగడం సహజం.. నాగర్జున పర్సనాలిటీ అలాంటిది.. సొగ్గాడే చిన్ని నాయనా సినిమా తర్వాత సరైన హిట్స్ లేవని చెప్పాలి. మన్మథుడు సినిమా కు సిక్వెల్ గా వచ్చిన మన్మథుడు 2 సినిమా అనుకున్నంత హిట్ ను అంధించ లేదు.. ఈ దెబ్బతో కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాల ను చేస్తున్నాడు.. ఇటీవల విడుదలైన వైల్డ్ డాగ్ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు.
ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. అందుకే యాక్షన్ పార్ట్ లో తన మార్క్ ను చూపించుకున్నాడు. అయితే ఈ సినిమా నాగ్ లో జోష్ ను నింపింది.. దాంతో ఇప్పుడు అలాంటి జోనర్ లో సినిమాలను చేస్తూ వస్తున్నాడు.. టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో నే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది. చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం నాగార్జున క్రావ్ మాగ, సమురాయ్ కత్తిసాము లాంటి ఇజ్రాయెలీ సెల్ఫ్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నాడని వార్తలు వినిపిసచేయనున్నాడు. అంతర్జాతీయ స్థాయి లో యాక్షన్ పార్టు ఉండటంతో..అందుకు తగినట్టుగా శిక్షణ తీసుకునే పనిలో నాగార్జున ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. మరోవైపు బంగార్రాజు సినిమా కూడా చేయనున్నాడు. ఈ సినిమా కు స్క్రిప్టు పనులను నాగ్ దగ్గరుండి చూస్తున్నాడు.. ఈ సినిమా ఎప్పుడూ సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.. ఏది ఏమైనా కూడా ఈ వయస్సు లో సినిమాల కోసం పెద్ద రిస్క్ చేస్తున్నాడు.. మరో వైపు రియాలిటీ షో లు బుల్లి తెర చేస్తూ తన క్రేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తూన్నాడు..