మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఈ రోజుకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన 2012లో ఇదే రోజు తన బ్యాచిలర్ లైఫ్‌కి ఎండ్ చెప్పాడు. ఉపాసనను పెళ్లాడి ఆమెకు తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. అంటే ఈరోజు ఈ స్వీట్ కపుల్ 9వ వెడ్డింగ్ ఆనివర్సరీ అన్నమాట. కాగా ఈ ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు రామ్ చరణ్‌కి చీర్స్ చెబుతూ మెగా అభిమానులకు కిక్కిచ్చే పోస్ట్ పెట్టింది మెగా వారింటి కోడలు ఉపాసన.
ప్రస్తుతం ఆమె యంగ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌గా దూసుకుపోతూ... అపోలో లైఫ్ విభాగం వైస్ ఛైర్మన్‌గా సత్తా చాటుతోంది. అంతే కాదు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవ చేస్తోంది. సినీ నటి కాకపోయినా తనదైన దారిలో వెళుతూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. ఎప్పటికప్పుడు యాక్టివ్ రోల్ పోషిస్తూ హెల్త్ టిప్స్ చెబుతుంది ఉపాసన. తన ఫాలోవర్స్‌తో నిత్యం టచ్‌లో ఉండటం ఉపాసనకు డైలీ పని.
ఇక ఈ రోజు వారి పెళ్లి రోజు సందర్భంగా రామ్ చరణ్‌తో దిగిన ఓ క్యూట్ పిక్ ను ఉపాసన షేర్ చేస్తూ తమ లైఫ్ జర్నీ గురించి కొన్ని విషయాలు చెప్పింది. రామ్ చరణ్‌తో ఈ రిలేషన్‌షిప్‌ని మరింత బలంగా, ప్రకాశవంతంగా ఉంచుకున్నందుకు చీర్స్ క్రేజీ విషెస్ చెప్పింది చెర్రీకి. అయితే ఆమె చేసిన ఈ పోస్ట్ కొద్ది సేపట్లోనే వైరల్ గా మారింది. మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వీరిద్దరికీ పెళ్లి రోజు విషెస్ చెబుతున్నారు.
ఇక ఉపాసన, రామ్ చరణ్ లు ఒకరంటే ఒకరికి ప్రాణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బిజీగా గడుపుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ మరో హీరోగా చేస్తున్నారు. దీని తర్వాత రామ్ చరణ్ శంకర్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉంది.