వినీత్ కి జీవితం ఇచ్చిన సంగీత ప్రాధాన్య చిత్రం

Mamatha Reddy
తెలుగునాట చాలా మంది హీరోలు తమ సత్తా చాటి స్టార్ హీరోలు గా పెద్దగా మరికొంతమంది మధ్యలోనే తమ కెరీర్ ను ముగించుకున్నారు. వచ్చిన తొలినాళ్లలో ఒకటి రెండు సినిమాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత వారు సినిమా సెలక్షన్లలో శ్రద్ధ చూపకుండా చేసుకుని ఆయా సినిమాల ఫ్లాప్ కు కారణం అవుతూ కెరీర్ ను నాశనం చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మరి కొంత మంది హీరోలు సినిమాలు చేస్తూ టాప్ హీరో గా ఎదుగుతూ ఉంటారు.
 సినిమా పరిశ్రమలోకి మలయాళ చిత్రాల ద్వారా ప్రవేశించి ఆ తరువాత సౌత్ లోని అన్ని భాషల్లో హీరోగా చేస్తూ మంచి గుర్తింపు దక్కించుకున్న హీరో వినీత్. 90వ దశకంలో ఆయన క్రేజ్ మామూలు గా లేదు. కుర్రకారు ఆయన సినిమాలంటే విపరీతంగా పడి చచ్చిపోయే వారు. అమ్మాయిలు ఆయనకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉండేవారు. తెలుగులో లో ఆయన కొన్ని డైరెక్ట్ సినిమాలు చేయగా చేసిన మొదటి సినిమా సరిగమలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత ప్రేమ పల్లకి రుక్మిని పాడుతా తీయగా సినిమాలు ఆయన కెరీర్ లో మంచి సినిమాలుగా మిగిలాయి.
ఆయన కెరీర్లో ఎప్పటికీ చెప్పుకో దగ్గ చిత్రం నిలుస్తుంది. సరిగమలు. ఈ సినిమా సంగీత పరంగా సూపర్ హిట్ కాగా కూడా కమర్షియల్ గా మంచి వసూళ్లను సాధించింది. అప్పటివరకు తెలుగు లో కాకుండా ఇతర డబ్బింగ్ సినిమా ల ద్వారా అలరిస్తూ వచ్చిన వినీత్ ఈ సినిమాతో తో తొలిసారి వినీత్ ప్రేక్షకులను అలరించారు. ఇందులోని ప్రతి పాట సూపర్ హిట్ గా నిలిచింది. 1994 లో విడుదల అయిన ఈ సినిమా వినీత్ కి మంచి సినిమా గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: