నిర్మాతల పాలిట దేవుడిగా మారుతున్న మెగా హీరో ?

VAMSI
మెగాస్టార్ వారసుడిగా చిరుత సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తేజ్ ప్రేక్షకుల మనసుని గెలుచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. పేరు కి స్టార్ కిడ్ అయినా అందరితోనూ సామాన్య వ్యక్తిలానే నడుచుకుంటాడు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. ప్రేక్షకులకు నచ్చిన విధంగా తనని తాను మార్చుకుంటూ నేడు ఈ స్థాయికి చేరుకున్నారు చెర్రీ. ఎంతో కష్టపడి తనకున్న టాలెంట్ తో అనతి కాలంలోనే స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు ఈ కుర్ర హీరో. ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది అగ్ర హీరోలు భారీగా పారితోషికం పెంచేస్తూ నిర్మాతలకు షాక్ లిస్తున్నారు. అంతే కాదు కొందరు స్టార్స్ అయితే పారితోషికంతో పాటు లాభాల్లో వాటాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

 అయితే సినిమాని డబ్బులు కోసం కాకుండా , ఫ్యాషన్  కోసం మాత్రమే చేసే వారు కొందరుంటారు అలాంటి వారిలో ఒకరు రామ్ చరణ్. ఎంత రెమ్యూనరేషన్ వస్తుందా అని ఆలోచించకుండా తన పాత్ర ఏమిటి ? కథ ఎంతవరకు ప్రేక్షకులకు రీచ్  అవుతుంది అన్న పాయింట్స్ పై ఎక్కువ ఫోకస్ చేస్తారు ఈ మెగా హీరో. అంతే కాదు ప్రస్తుతం టాలీవుడ్ లో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో రామ్ చరణ్  అని అంటున్నారు. టాలెంట్ కి ఏమీ కొదువ లేదు, స్టార్ డం మామూలుగా లేదు, మిగిలిన స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోడు కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం  పెద్దగా ఆలోచించడట చెర్రీ .

ప్రస్తుతం చెర్రీ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను కేవలం 35 కోట్లు మాత్రమే పారితోషికంగా తీసుకున్నట్లు సినీ సర్కిల్స్లో లో వినికిడి. ఇక ఆచార్య సినిమాలో సెకండ్ హాఫ్ కోసం పారితోషికంగా 20 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రెమ్యూనరేషన్ విషయంలో చెర్రీ ఇబ్బంది పెట్టకుండా నడుచుకోవడం చాలా గొప్ప విషయం. ఈ విధంగా చరణ్ నిర్మాతల పాలిట గొప్ప మనిషిగా మారాడు. ఈ కష్ట కాలంలో మిగతా హీరోలు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే నిర్మాతలు నష్టాల పాలు కాకుండా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: