ఫ్యామిలి మ్యాన్ తో పాన్ ఇండియా గుర్తింపు దక్కించుకున్న సమంత....
ఇక ఇంటర్నేషనల్ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అందులో సమంత నటించిన రాజీ అనే బోల్డ్ పాత్ర అందరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది.ఇక దెబ్బకి సమంత పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకుంది. తన పాత్రతో నార్త్ ఇండియా ఆడియన్స్ ని కూడా దక్కించుకుంది. ఇక ప్రస్తుతం సామ్ కు స్టార్ హీరోయిన్స్ కంటే హై రేంజ్ లో డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. దీంతో మరో ఇంటర్నేషనల్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కూడా సమంత కోసం ఒక వెబ్ కంటెంట్ ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. సమంత ఓకే అంటే చాలాట ఆమెకు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ఒక్కసారి ఫిక్స్ అయితే బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. కంటెంట్ బావుంది అంటే ఆ రోల్ కు సెట్టయ్యే యాక్టర్స్ కోసం ఎంత ఖర్చయినా చేయ్యడానికి రెడీ అవుతారు. ఇక మన సామ్ పై కూడా వారు గట్టి నమ్మకంతో ఉన్నారట.