మన టాలీవుడ్ లో మన హీరోల పేర్లు అందరికీ తెలుసు. అయితే వారి నిజమైన పేర్లు ఏమిటి? ఎంతమంది టాలీవుడ్ లో పేరు మార్చుకున్నారు అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
1). చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు . ఈయన సినిమాలలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు . ఈయన అసలు పేరు"కొణిదెల శివశంకర వరప్రసాద్".
2). రజినీకాంత్:
తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో రజినీకాంత్. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అయితే ఈయన అసలు పేరు "శివాజీరావ్ గైక్వాడ్".
3). ప్రభాస్:
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో అంటే ప్రభాస్ అని గుర్తుకొస్తుంది మనకు. అయితే ఈ రెబల్ స్టార్ అసలు పేరు "ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు".
4). పవన్ కళ్యాణ్:
ఏదైనా రికార్డ్ క్రియేట్ చేయాలంటే అది పవన్ కళ్యాణ్ కే సాధ్యం అని చెప్పవచ్చు. ఆయన ఫాలోయింగ్ తో ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. అయితే ఈయన అసలు పేరు "కొణిదెల కళ్యాణ్ బాబు".
5). నాచురల్ స్టార్ నాని:
ఏ సపోర్టు లేకుండా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న హీరోలలో నాని కూడా ఒకరు. అయితే నాని అసలు పేరు"గంటా నవీన్ బాబు".
6). మోహన్ బాబు:
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఇతనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఈయన అసలు పేరు"భక్తవత్సలం నాయుడు".
7). రవితేజ:
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా, అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టి, స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు రవితేజ. అయితే ఈయన అసలు పేరు"భూపతిరాజు రవిశంకర్ రాజు".
8). మమ్ముట్టి:
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాత్రలో తను బాగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఈయన అసలు పేరు"మహమ్మద్ కుట్టి పని పరంబాల్ ఇస్మాయిల్".
9). సూపర్ స్టార్ కృష్ణ:
ఒకే సంవత్సరంలో అప్పట్లో దాదాపుగా 18 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సృష్టించింది కృష్ణ గారే. అయితే ఈయన అసలు పేరు"ఘట్టమనేని శివరామకృష్ణ".