అరెరే వాన జడి వానా పాటతో హృదయాలను దోచేసిన తమన్నా..!

Suma Kallamadi
తమిళంలోని "పయ్యా" పేరుతో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిన చిత్రాన్ని తెలుగు లో ఆవారా గా డబ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. మందార పూవల్లే.. నీ ఎదలో నాకు చోటే వద్దు.. చుట్టేసై చుట్టేసై.. చిరు చిరు చిరు చినుకై.. పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యాయి. దిగ్గజ సంగీతదర్శకుడు యువన్ శంకర్ రాజా ఆవారా సినిమా కి అద్భుతమైన సంగీతం సమకూర్చారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

అయితే ఈ సినిమా లో ఒక వర్షం పాట ఉంటుంది. ఈ చిత్రంలో తన తల్లిని కోల్పోయి.. తన తండ్రి హింస భరించలేక ముంబైలో ఉండే తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోవాలని తమన్నా అనుకుంటుంది. ఈలోగా తన తండ్రి బిజినెస్ భాగస్వామి అయిన జయరామన్ తమన్నా ని బలవంతంగా నెల్లూరు తీసుకెళ్లానుకుంటాడు. కానీ తమన్నా ఇంటి నుంచి పారిపోతుంది.

ఆమె ముంబై వెళ్ళడానికి పయనమైనప్పుడు.. హీరో కార్తీ తారసపడతాడు. అప్పటికే కార్తీ తమన్నా ని చూసి ప్రేమలో పడతారు. మళ్లీ ఆమె తనకు ఎక్కడ కనిపిస్తోందోనని ఆయన వెతుకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తమన్నా అతని కారు వద్దకు వచ్చి ముంబై కి వెళ్లాలని అడగగానే అతను ఆశ్చర్య పోయి వెంటనే ఒక టాక్సీ డ్రైవర్ గా మారి ఆమెను ముంబాయి తీసుకెళ్లేందుకు తన పనులన్నీ పక్కన పెట్టేస్తారు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత తమన్నా, కార్తీ ఒక చోట ఆగుతారు. బాధలు అనేవి చాలా చిన్నవని.. వాటిని పెద్ద మనసుతో చూస్తే ఎప్పుడూ చిన్నగానే కనిపిస్తాయని తమన్నాకి చెప్పి ఆమెలో కొండంత విశ్వాసం నింపుతారు.



ఈ క్రమంలోనే వర్షం పడుతుంది. దీంతో తమన్నా వర్షంలో నాట్యం చేస్తూ తన బాధలు అన్నీ మర్చిపోయి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. అయితే తాను అమితంగా ప్రేమిస్తున్న అమ్మాయి సంతోషంతో డాన్స్ చేస్తుంటే ఆ ఆనంద క్షణాలను కార్తీ బాగా ఆస్వాదిస్తుంటారు. ఈ పాటలో కనిపించిన ప్రదేశాలు చాలా రమణీయంగా ఉన్నాయి. ఈ పాటలో తమన్నా తన తడి అందాలతో ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. అయితే ఈ మధురమైన పాట ను రాహుల్ నంబియార్, సైంధవి ఆలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: