ఆ కారణంగానే హీరో వేణు సినిమాలకు దూరం అయ్యాడు!
స్వయంవరం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వేణు ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. వరుస ఫ్లాప్ ల వల్లే ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారు అనేకంటే ఓ కారణం వల్ల ఆయన ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో పేరు తెచ్చుకున్న వేణు సడన్ గా ఇండస్ట్రీని వదిలేయడంతో ఆయన అభిమానులు ఎంతో నిరాశ పడ్డారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ తరువాత ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ మరియు సెంటిమెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆరడుగుల పొడుగు ఉన్నప్పటికీ తన బాడీ ఇమేజ్ కి తగినట్లుగా పాత్రలను ఎంపిక చేసుకుని హీరోగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.
సుమారు 26 సినిమాల్లో హీరోగా నటించిన వేణు ఎక్కువ శాతం హిట్లను తన ఖాతాలో వేసుకుని 2006 తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నరు. మళ్ళీ 2012లో ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన దమ్ము సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించాడు. రీ ఎంట్రీ లో వరుస సినిమాలు చేస్తాడు అనుకుంటే ఆ సినిమా కాస్త పరాజయం పాలయింది. ఆ వెంటనే ఆయన హీరోగా రామాచారి అనే సినిమా వచ్చిన అది కూడా ఫ్లాప్ అవడంతో తన వ్యాపార పనుల్లో బిజీ అయిపోయాడు. అలా అలా సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయాడు. 2019 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున ఆయన భావ నామా నాగేశ్వరరావు తరపున ప్రచారం చేశాడు. మరి భవిష్యత్తులో వేణు సినిమాల్లో నటిస్తారా లేదా రాజకీయాలవైపు మల్లుతారా అనేది చూడాలి.