ఈ టాలీవుడ్ 5 హీరోల 25 వ చిత్ర ఫలితం ఏమిటో తెలుసా ?

VAMSI
చిత్రసీమలో అడుగు పెట్టి కొనసాగడం అంటే అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. వారి సినిమాలను హిట్ అండ్ ఫ్లాప్ అని ఈజీ గానే విశ్లేషిస్తాము. కానీ ప్రతీ సినిమాను సక్సెస్ చేయాలన్న దృఢసంకల్పంతో కష్టపడి చేస్తారు ఆ మూవీ టీం మెంబర్స్. ఇక హీరోల సినీ జీవితంలో 25, 50, 100 అనే నెంబర్లు ఎంతో కీలకమైనవి అనే చెప్పాలి. ప్రతి హీరోకి 25వ సినిమా అనేది చాలా ప్రత్యేకమైనది. ఆ 25వ సినిమా హిట్ అయితే వచ్చే క్రేజే వేరు. అందుకనే ప్రతి ఒక్క హీరో తమ 25వ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కథ, డైరెక్టర్, పాటలు ఇలా ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగు వేస్తారు. వారి కెరీర్లో 25వ సినిమా అంటే ఒక మైలురాయి అని చెప్పాలి. వారు చేసే 25 సినిమా కథ సక్సెస్ అయ్యింది అంటే ఆ కిక్కే వేరు. ఒకవేళ ఫ్లాప్ అయింది అంటే అది వారి సినీ జీవితంలో ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోల 25వ సినిమా విశేషాల గురించి ఓ లుక్కేద్దాం.


1. ముందుగా టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి 25వ సినిమా విషయానికొస్తే, బ్రేక్ డాన్స్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ హీరో నటించిన 25వ చిత్రం  `న్యాయం కావాలి` కోదండరామి రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సక్సెస్ ను సొంతం చేసుకుంది. 100 రోజులు విజయవంతంగా ఆడిన ఈ సినిమా చిరు కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది.  ఈ సినిమా బడ్జెట్ ఐదు లక్షలు కాగా, చిరు ఈ సినిమా కి 5000 పారితోషకం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.

 2. ఆ తర్వాత టాలీవుడ్ మన్మధుడు నాగార్జున తన 25వ సినిమాగా "జైత్రయాత్ర" చేశారు. ఉప్పలపాటి నారాయణరావు  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రంలో నాగ్ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.

3. నందమూరి వారసుడు బాలకృష్ణ కెరీర్లో 25వ చిత్రంగా రూపుదిద్దుకున్న "నిప్పులాంటిమనిషి". ఎస్. బి. చక్రవర్తి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. యావరేజ్ గా నిలిచింది. కానీ ఈ సినిమాలో బాలయ్య నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

4. యూత్ ఐకాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 25వ సినిమా అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ పవన్ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలింది.



5. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో 25 సినిమాగా వచ్చిన చిత్రం నాన్నకు ప్రేమతో. జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ ను అందుకుంది.

 ఇలా ఈ అయిదు హీరోల 25 వ సినిమాల ఫలితాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: