పెద్ద పొరపాటు చేయనున్న సుకుమార్..?

Suma Kallamadi
ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా విషయంలో అనేక కొత్త నిర్ణయాలను చిత్రబృందం తీసుకుంటోంది. "పుష్ప" కు సంబంధించి నటీనటుల నుంచి.. సినిమా భాగాల వరకు అన్నీ కూడా తారుమారు అవుతున్నాయి. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా.. సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ చిన్న పొరపాటు చేసిన సినిమాపై నెగెటివ్ ప్రభావం పడే ప్రమాదం ఉంది కాబట్టి సుకుమార్ ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలను ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది.


అయితే ఈ చిత్రంలో విలన్ గా నటించే ఫహద్‌ ఫాజిల్ క్యారెక్టర్ కి టాలీవుడ్ హీరో తరుణ్ చేత డబ్బింగ్ చెప్పించడానికి పుష్ప చిత్రబృందం సిద్ధమైందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ అభిమానులు మాత్రం ఉసూరుమంటున్నారు. తరుణ్ చేత డబ్బింగ్ చెప్పిస్తే సినిమా ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉదాహరణగా ఆకాశం నీ హద్దురా సినిమాని చూపిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య రోల్ కి సత్య దేవ్ కొత్తగా డబ్బింగ్ చెప్పారు. కానీ ప్రేక్షకులు సత్యదేవ్ డబ్బింగ్ వినలేక ఇబ్బంది పడిపోయారు.


కథానాయకుడి లేదా ప్రతినాయకుడి పాత్రకు వాయిస్ ఓవరే ఆయువుపట్టు అని చెప్పుకోవచ్చు. వాయిస్ ఓవర్ బాగోలేకపోతే సినిమా కొద్ది నిమిషాల పాటు కూడా చూడలేము. ఈ విషయాన్ని విస్మరించి ఆకాశం నీ హద్దురా పెద్ద పొరపాటు చేసిందనే చెప్పుకోవాలి. అయితే అదే పొరపాటును తరుణ్ తో కలిసి పుష్ప చిత్రబృందం చేయనుందా? అనే డిస్కషన్ ప్రస్తుతం నడుస్తోంది. అనుకోని అతిధి చిత్రానికి తరుణ్ డబ్బింగ్ చెప్పారు. దీంతో అతడిని పుష్ప సినిమా కోసం కూడా ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ తరుణ్ వాయిస్ ని టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటినుంచో వింటున్నారు కాబట్టి ఫహద్‌ ఫాజిల్ కి అతను వాయిస్ ఓవర్ ఇచ్చినా.. అది అస్సలు సూట్ అయినట్లు అనిపించదు. దీనితో అభిమానులు తరుణ్ వాయిస్ వద్దంటే వద్దు అని సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: