బిగ్ బాస్ షో చాలా మందికి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అలాంటి వారిలో నటి దివి ఒకరు. బిగ్ బాస్ తెలుగు-4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దివి ఇప్పుడు ఒక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెరిగింది. దివి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడూ తన ఫోటోలను, తన సినిమా అప్ డేట్స్ ను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోజులతో తీసుకున్న ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఛాతిపై ఉన్న టాటూ కనిపించేలా తీసుకున్న ఫోటోలను దివి పోస్ట్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపైన చర్చ కూడా జరుగుతోంది.
తాజాగా ఈ బ్యూటీ హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమన్-2020 టెలివిజన్ గా ఎంపికైంది. బిగ్ బాస్ వల్ల దివి అతి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక తనకు హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ట్యాగ్ రావడంపై దివి సంతోషం వ్యక్తం చేసింది. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ట్యాగ్ తనకు సినిమా ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందని భావిస్తున్నట్లు దివి ఆశాభావం వ్యక్తం చేసింది. థియేటర్ లో తనను తాను చూడాలనేది తన కోరిక అని దివి చెప్పింది. దివి ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. అంతేకాకుండా ‘లంబసింగి’ అనే సినిమాలో కూడా దివి నటిస్తోంది. ఇటీవల స్పార్క్ ఓటీటీ వేదికగా విడుదలైన ‘క్యాబ్ స్టోరీస్’ వెబ్ సిరీస్ లో కూడా దివి నటించింది. ప్రస్తుతం దివి వెబ్ సిరీస్ లతో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది.
దివికి అబ్బాయిల్లో ఎక్కువగా ఎత్తు విషయాన్ని గమనిస్తానని చెప్పింది. తన ఎత్తు 5’8 కాబట్టి అబ్బాయి కనీసం 6’2 లేదా 6’3 ఉండాలని ఆమె చెప్పింది. అలాగే ఆ అబ్బాయి తెలివితేటలు ఉన్న వ్యక్తి కావడం చాలా ముఖ్యం అని తెలిపింది. కష్టపడి పని చేసేవారు, తనపై శ్రద్ధ చూపెట్టేవారు, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో తనతోనే ఉండేవారు కావాలని, అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలే ఇష్టమని దివి చెప్పింది. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నట్లు దివి చెప్పుకొచ్చింది.