శిరీష్ కు బ‌న్నీ బ‌ర్త్ డే విషెస్.. నా స‌పోర్ట్ నువ్వే అంటూ ఎమోష‌న‌ల్.. !

MADDIBOINA AJAY KUMAR
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు ,టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఈరోజు పుట్టిన రోజును జరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శిరీష్ కు అభిమానులు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోను ట్రెండ్ చేస్తున్నారు. అల్లు శిరీష్ అభిమానులే కాకుండా తమ హీరో తమ్ముడు కావడం తో బన్నీ అభిమానులు కూడా శిరీష్ కు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక తాజాగా శిరీష్ అన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తమ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టారు. "నా స్వీటెస్ట్ బ్రదర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్ తమ్ముడూ. రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా" అంటూ బన్నీ పోస్ట్ పెట్టారు. దానికి శిరీష్ రిప్లై ఇస్తూ... "థాంక్యూ అల్లు అర్జున్...మీలాంటి అన్నయ్య ముందు నేను ఎదగడం నా అదృష్టం. నా ఫ్రెండ్ నా గైడ్ మీరే" అంటూ రిప్లై ఇచ్చారు. 

ఇదిలా ఉండగా అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న "ప్రేమ కాదంట" సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు ప్రీ లుక్ ల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు కూడా పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తుండగా..జీ ఏ పిక్చర్స్ బ్యానర్ మరియు శ్రీ తిరుమల ప్రొడక్షన్స్  ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ శిరీష్ చేసిన సినిమాల‌న్నీ రొమాంటిక్ ప్రేమ‌క‌థ‌లే కానీ ఈ సినిమా స‌మ్ థింగ్ డిఫ‌రెంట్ గా క‌నిపిస్తోంది. సినిమా ప్ర‌మోష‌న్ ల కోసం కూడా అనూ మ‌రియు శిరీష్ తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఏం ఉందో ఏం లేదో తెలియ‌దు కానీ సోష‌ల్ మీడియాలో ఒక‌రిపై మ‌రొక‌రు పోస్ట్లు పెడుతూ సంద‌డి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: