అబ్బబ్బా.. రష్మీ, సుధీర్ లవ్.. మరోసారి జబర్దస్త్ స్టేజ్ మెరిసిపోయింది?

praveen
సుధీర్ రష్మీ ఢీ జోడి..  ఈ పేరు వింటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఉర్రూతలూగి పోతూ ఉంటారు.  జబర్దస్త్ లో ఒక సాదా సీదా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ వచ్చినప్పటినుంచి రష్మి కి లైన్ వేస్తూనే ఉన్నాడు.  ఇక అప్పటినుంచి ఇప్పటివరకూ వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందా లేదా అన్న విషయం ఇప్పటికీ  ఎవరికీ క్లారిటీ లేదు. కానీ వీరిద్దరిని చూస్తే మాత్రం బుల్లితెర ప్రేక్షకులు అందరూ మురిసిపోతూ ఉంటారు. ఎందుకంటే వీరిద్దరి మధ్య సంభాషణ..  ఇక వీరిద్దరూ ఒకరి పై ఒకరు చూపించుకునే అభిమానం మాత్రం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. ఈటీవీ లో మొదలైన వీరి ప్రేమాయణం.. ప్రస్తుతం బుల్లితెర మొత్తం పాకిపోయింది.



 వీరిద్దరూ ఎప్పుడు మాట్లాడిన.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్న విషయం ప్రేక్షకులకు అర్థం అవుతూ ఉంటుంది.  అయితే ఇది కేవలం స్క్రిప్ట్ కోసమేనా లేదా నిజంగానే వీరి మధ్య ప్రేమ ఉందా అన్నది మాత్రం అటు బుల్లితెర ప్రేక్షకులకు పట్టించుకోరు. ఎందుకంటే వీరి జోడి చూస్తున్నంత సేపు కన్నులపండుగగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు సుధీర్ రష్మీ పెళ్లి చేసుకుంటే బాగుండు అని కోరుకునే బుల్లితెర ప్రేక్షకులు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్,  ఢీ లాంటి కార్యక్రమాలలో  కొన్ని కొన్ని సార్లు సుధీర్ రష్మీ ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడు కోవడం బుల్లితెర ప్రేక్షకులు అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది.



 ముఖ్యంగా రష్మీ పై తనకున్న ప్రేమను తెలియజేస్తూ సుదీర్ చెప్పే డైలాగులు అయితే అటు ప్రేమికుల అందరి మనసులను తాకుతూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నిజమైన ప్రేమికుడు అంటే సుదీర్ లాగే ఉండాలేమో అని అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. ఇటీవలే మరో సారి రష్మీ, సుధీర్ మధ్య ప్రేమ సంభాషణతో జబర్దస్త్ స్టేజ్ మొత్తం కళకళలాడిపోయింది.  పండగ రోజు అందరూ లీవ్ తీసుకోవాలి కదా అంటూ చెబుతాడు సుధీర్.. ఈ రోజు పండగ ఏమీ లేదు కదా అంటూ అడుగుతుంది రష్మి..  నీ బర్త్ డే కంటే నాకు పెద్ద పండుగ ఏముంది అంటూ సుధీర్ చెప్పడం.. ఇక బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్.. రష్మి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్..  అబ్బో మాటల్లో వర్ణించడం కష్టమే సుమీ. ఇక దీనికి సంబంధించిన పూర్తి స్కిట్ చూడాలంటే మాత్రం  ఎక్స్ ట్రా జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ వచ్చేంత వరకు ఆగాల్సిందే మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: