బ్లడ్ బ్యాంక్ లో బిజినెస్.. "మా" డబ్బులతో సేవ.. శ్రీరెడ్డి సంచలనం.. !
పావలా శ్యామలకు ఇచ్చిన డబ్బు..ఇతర సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న డబ్బులు సొంత డబ్బులా..? లేదంటే మూవీ అసోసియేషన్ నుండి ఫండ్ రైసింగ్ చేసిన డబ్బులా..? ఇండస్ట్రీలో ఫండ్ రైసింగ్ చేసినప్పుడు బాలయ్య రూ.50 లక్షలు ఇచ్చారని..కొంతమంది సెలబ్రెటీలు కోట్లలో ఇచ్చారచి చెప్పింది. ఇప్పుడు అవే డబ్బులను చిరంజీవి తన పేరుతో సహాయ కార్యక్రమాలకు తన పేరుతో ఉపయోగిస్తున్నారా అని ప్రశ్నించింది. ఫండ్స్ అన్నీ ఎక్కడ పోయాయని వాటి లెక్కలన్నీ చిరంజీవి చెప్పాలని డిమాండ్ చేసింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తం కావాలంటే డబ్బులు అడుగుతున్నారని పుకార్లు ఉన్నాయని తెలిపింది. కాబట్టి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పై ఐటీ రైట్స్ జరిగితే అసలు నిజం ఏమిటన్నది భయటపడుతుందని వ్యాక్యానించింది.
మా అసోసియేషన్ లో ఎంతో మంది ఎన్నికయ్యారని... కానీ పావలా శ్యామల కు సాయం చేసేందుకు కరాటే కల్యాణినే ఎందుకు పంపించారని పేరు చెప్పకుండా అడిగింది. హేమగారు మీకు చాలా క్లోజ్ కదా ఆమెను ఎందుకు పంపించలేదని ప్రశ్న వేసింది. మీకు కేఎఫ్సీ చేసుకునేంత టైమ్ ఉంది కానీ పావలా శ్యామల వద్దకు వెళ్లి సాయం చేయడానికి లేదా అంటూ ప్రశ్నించింది. అమెరికాకు వెళ్లి తీసుకున్న ఫండ్స్ ఏం చేసారని అడింగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పైన కూడా శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. పవన్ కల్యాణ్ చదువుకోలేదని పది, ఇంటర్, డిగ్రీ అన్నీ ఫెయిల్ అంటూ సంచలన కామెంట్స్ చేసింది. జగన్ పై ఆరోణలు చేసే అర్హత పవన్ కల్యాణ్ కు లేదని చెప్పింది. పొత్తులు పెట్టుకునేందుకే పార్టీని పెట్టారా అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించింది.