"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?
ఇప్పుడు తెరకెక్కిస్తున్న సినిమాలలో రాధే శ్యామ్ మూవీ కొంతభాగం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మినహా పూర్తయినట్లే. కానీ మూవీ యూనిట్ ప్రకటించిన సమయానికి 2 నెలల సమయం మాత్రమే ఉంది. కానీ తాజా పరిస్థితుల దృష్ట్యా ఇది ఎంతవరకు సాధ్యమో అర్ధం కాని పరిస్థితి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన వార్త చిత్రపురిలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే రాధే శ్యాం మూవీకి చెందిన థియేటర్ హక్కులు మరియు ఓవర్సిస్ డీల్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కేవలం ఓటిటి హక్కులు ఒక్కటే పూర్తి కావాల్సి ఉందని సమాచారం. తెలుస్తున్న సమాచారం ప్రకారం రాధే శ్యామ్ హిందీ థియేట్రికల్ హక్కులను దాదాపు 120 కోట్ల వరకు జరిగినట్లు భోగట్టా.
కానీ అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన లేకపోవడంతో, ప్రస్తుతానికి ఇది ఒక గాసిప్ గానే మిగిలిపోయింది. ఇందులో నిజమెంత ఉందొ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా రాధే శ్యామ్ మూవీ ఒక అద్భుతమైన పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. యూవి క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.