పూరీ పలుకులు : పేదరికం చూడకుండా చావొద్దు..!!

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు పూరీ జగన్నాథ్. గత కొంతకాలంగా పరాజయాలతో డీలా పడ్డ పూరీ.ఇటీవల 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు.ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో పూరీ మ్యూజింగ్స్‌ అనే వేదిక ద్వారా పలు ఆసక్తికరమైన అంశాలపై ముచ్చటిస్తూ వస్తున్నాడు ఈ దర్శకుడు. ఇక తాజాగా 'పేదరికం' గురించి పూరీ మ్యూజింగ్స్ వేదికగా ముచ్చటించారు పూరీ. ధనవంతుడిగా జీవించే వ్యక్తి చివరికి ఏమీ నేర్చుకోలేడని.. కానీ పేదరికంలో ఉండే వ్యక్తి ఎన్నో జీవిత పాఠాలు తెలుసుకోగలుగుతాడని అన్నారు. 'పేదరికం' గురించి ఆయన ఏమన్నారంటే..'డబ్బులో పుట్టి డబ్బులో పెరుగుతున్న రిచ్‌ కిడ్స్‌, అలాగే ఏ కష్టం తెలియకుండా తల్లిదండ్రుల నీడలో పెరుగుతున్న బంగారాల కోసమిది.

మీ పిల్లల కోసం.. నా పిల్లల కోసం.. ఏ కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచాలని మనం చూస్తాం..అది చాలా తప్పు. వాళ్లకి కష్టం తెలియాలి. యుద్ధం తెలియాలి. యుద్ధం నేర్పకపోతే మీ కొడుకు అలెగ్జాండర్‌ కాలేడు. యుద్ధం చేయాలంటే వాడు కత్తిపట్టాలి. రక్తం చిందాలి''పేదరికం ఎవరికీ నచ్చదు. అందులో ఉండాలని ఎవరూ కోరుకోరు. మనందరం డబ్బు కావాలని కోరుకుంటాం. దాని కోసం ఎంతో కష్టపడతాం. తప్పులేదు. కానీ ఒక ధనవంతుడిగా నువ్వు ఏదీ నేర్చుకోలేవు. ఒక పేదవాడిగా నువ్వు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మీకు ఎంత డబ్బు ఉన్నా సరే జీవితంలో ఒక్కసారైనా పేదవాడిగా జీవించండి. కనీసం ఒక్క నెలరోజులైనా వేరే ఊరుకి వెళ్లి మీ కాళ్లపై మీరు నిలబడండి.

 జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. కష్టం, కన్నీళ్లుకు సరైన నిర్వచనం అర్థమవుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బుని మీ అమ్మనాన్నలకు ఇవ్వండి. ఇన్నాళ్లు మీకోసం వాళ్లు ఎంత చేశారో అర్థమవుతుంది. జీవితాంతం ధనవంతుడిగా బతకడానికి ముందు ఒక్కసారి పేదరికం చూడండి. చనిపోయేలోపు ఒక్కసారైన పేదవాడిగా బతకండి. పేదరికం చూడకుండా అస్సలు చావొద్దు' అని పూరీ వివరించారు.ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నాడు పూరి. ఇప్పటికే షూటింగ్ కొంతవరకు జరుపుకున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: