మహేష్ బాబు ఒక్కడే ఆ పని చేస్తాడు : అభిషేక్ నామా !

Divya

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, సినిమా విడుదల అయిన తర్వాత  బాగా కలెక్షన్లు సంపాదించడం కూడా మరో ఎత్తు. అయితే కొన్ని సినిమాలు బాగున్నా కూడా ఫ్లాప్ అవుతుంటాయి. అలాంటప్పుడు సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు చాలా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్ల లో అభిషేక్ నామా కూడా ఒకరు. అయితే తను తాజాగా మహేష్ బాబు పై ఒక షాకింగ్ కామెంట్ చేశారు. అది ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


అభిషేక్ నామా చాలా చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. కేశవ, బాబు బాగా బిజీ, సాక్ష్యం, గూడచారి వంటి చిత్రాలకు ఆయన నిర్మాతగా నిర్వహించినా సక్సెస్ రేటు మాత్రం తక్కువగానే ఉంది. అయితే డిస్ట్రిబ్యూటర్ గా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ తో కలిపి వందలాది చిత్రాలకు  పైగా పనిచేశారు అభిషేక్ నామా.

ఇతను డిస్ట్రిబ్యూటర్ గా తీసుకున్న ఏరియాను బట్టి, ముఖ్యంగా నైజాం ఏరియా కు సంబంధించి.. వరుడు, గుండెజారి గల్లంతయింది, అత్తారింటికి దారేది, మనం, హార్ట్ ఎటాక్,కుమారి 21ఎఫ్,లోఫర్,రుద్రమదేవి, శ్రీమంతుడు,కబాలి,బ్రహ్మోత్సవం,సుప్రీమ్,వరల్డ్ ఫేమస్ లవ్,ఇస్మార్ట్ శంకర్ ఇలా చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు అభిషేక్ నామా. దాదాపుగా అన్ని స్టార్ హీరోలు, స్టార్ నిర్మాతలతో పనిచేసిన ఆయన, లాభనష్టాలు..  హీరోల భాగస్వామ్యం పై ఆసక్తికరమైన కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత  అభిషేక్ నామా మాట్లాడుతూ.." సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకవేళ  డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు అంటే ఆయన అసలు తట్టుకోలేరు. పిలిచి మరీ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేస్తారు".. అంటూ చెప్పుకొచ్చారు. "అలాగే వరుడు సినిమాకి దాదాపు 80శాతం లాస్ అయ్యాను. పెట్టిన అమౌంట్ కూడా తిరిగి రాలేదు. కొంతమంది అయితే నా వల్ల నష్ట పోయావు కదా.. నెక్స్ట్ సినిమా తీసుకో అంటారు . అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది.

కాని సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే ఎవరైనా నిర్మాత, తన సినిమా వల్ల నష్టపోతే పిలిచి అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు. ఒకవేళ నెక్స్ట్ సినిమా ఆయనతో చేసిన చేయకపోయినా,  ప్రొడ్యూసర్ తో సంబంధం లేకుండా డబ్బులు ఇచ్చేస్తారు. టాలీవుడ్ లో ఆయన ఒక్కరే ఇలా చేస్తుంటారు. ఆయన లాగ అందరూ చేయగలిగాలి అని చెప్పుకొచ్చారు అభిషేక్ నామా. అంతేకాకుండా హార్ట్ ఎటాక్ సినిమాతో  నాకు చాలా లాస్ వచ్చింది. ఆ తరువాత వచ్చిన "లోఫర్" సినిమా తో మొత్తం నష్టపోయాను. అయితే పూరి జగన్నాథ్ పిలిచి మరీ  ఇస్మార్ట్ శంకర్ సినిమా  ఇచ్చి నష్టాన్ని భర్తీ చేశారు" అంటూ చెప్పుకొచ్చారు అభిషేక్ నామా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: