దీప అంతిమయాత్ర.. ?
దాంతో దీప ‘ఈ క్షణం కూడా మీకు నన్ను తాకాలనిపించడం లేదా భుజం మీద చేయి వేసి ఓదార్చాలనిపిచడం లేదా? అని కన్నీళ్లతో కార్తీక్ వైపు చూడటంతో.‘అదేం లేదు ఏదో ఆలోచిస్తున్నాను. అంటూ కార్తీక్ దీప భుజంపైన చేయి వేస్తాడు ప్రేమగా.
వెంటనే దీప కన్నీళ్లతో తన భుజం మీద ఉన్న కార్తీక్ చేతిని ప్రేమగా రెండు చేతుల్లోకి తీసుకుని చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ సీన్ చూస్తే ఎవరికయినా ఏడుపు గ్యారంటీ. దాంతో దీప ఏడుస్తూ ‘ఉన్నంతకాలం చేయి వదిలేశారు.. ఈ రోజు దాకా దూరంగా ఉన్నారు.. కనీసం శాశ్వతంగా వెళ్తున్నప్పుడైనా తోడుగా ఉన్నారు.. కాపురంలో కలిసి నడవకపోయినా నా అంతిమ యాత్రలో కలిసి నడిచి తుడి వీడ్కోలు చెప్పడానికైనా పక్కనే ఉన్నారు థాంక్స్ డాక్టర్ బాబు..’ అని దీప ఏడుస్తూ కార్తీక్ చేతిని వదిలి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోతుంది.ఇదిలా ఉండగా దీప నాన్న మురళి కృష్ణకు దీప గురించి ఏదో పిచ్చి కల వచ్చింది అంటూ లేచి కంగారు పడుతూ ఉంటాడు. దీంతో భాగ్యం ధైర్యం చెప్పి దీపక ఫోన్ చేస్తుంది.
ఇక దీప ఫోన్ హాల్లో కార్తీక్ కూర్చున్న సోఫా దగ్గర ఉండగా వెంటనే కార్తీక్ ఫోన్ తీసుకొని కంగారు పడవద్దు అని దీప తో మాట్లాడిస్తాడు. ఇక దీప తన భవిష్యత్తు లో తనకు వచ్చే ముప్పు గురించి దృష్టిలో పెట్టుకొని తన తండ్రితో మాట్లాడుతుంది.దీపా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మ అంటూ తెగ బాధపడుతూ ఉంటాడు దీప తండ్రి . ఇక దీప ధైర్యం చెప్పి ప్రశాంతంగా పడుకోమని చెబుతుంది. దీప తన మనసులో తన తండ్రి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ వెళ్లిపోతున్నా నాన్న. శాశ్వతంగా ఎవరికి కనపడకుండా పోతున్నాను నాన్న.నేను లేకపోతే నువ్వు ఏమై పోతావు. నిన్ను ఎవరు ఓదారుస్తారు నాన్న అంటూ ఏడుస్తూ పిల్లల పక్కన పడుకుని తన నాన్న గురించి ఏమైపోతాడో అని బాధతో కుమిలిపోతుంది.