బోయపాటి - రవితేజ ల బ్లాక్ బస్టర్ హిట్ కి 16 ఏళ్ళు ..... !!

GVK Writings
తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్నారు బోయపాటి శ్రీను. దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా మీరాజాస్మిన్ హీరోయిన్ గా రూపొందిన భద్ర సినిమా ద్వారా దర్శకుడిగా తొలిసారిగా మెగాఫోన్ పట్టారు బోయపాటి శ్రీను. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో మురళీమోహన్, దివంగత నటుడు పద్మనాభం, ప్రదీప్ రావత్, అజయ్, ఝాన్సీ, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు చేశారు.
మంచి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా పలు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి దర్శకుడు బోయపాటి ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. రిలీజ్ అనంతరం ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. మాస్ మహారాజా రవితేజ వండ్రఫుల్ పెర్ఫామెన్స్, హీరోయిన్ మీరాజాస్మిన్ ఆకట్టుకునే అందం అభినయం, ఆకట్టుకునే యాక్షన్ ఫైట్ సన్నివేశాలు, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యూటిఫుల్ సాంగ్స్ వండర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అద్భుతమైన ఫోటోగ్రఫీ విజువల్స్, ముఖ్యంగా అందరినీ ఆకట్టుకునే కథ, కథనాలు వెరసి భద్ర సినిమా ని అంత భారీ సక్సెస్ చేశాయి. ఇక ఈ సినిమాలో ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విలన్స్ దాడి చేసి {{RelevantDataTitle}}