పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా 'గబ్బర్ సింగ్'..ఈ విషయం ఏ ప్రేక్షకుడ్ని అడిగినా చెప్తాడు.. ఎందుకంటే గబ్బర్ సింగ్ కంటే ముందు పవన్ కళ్యాణ్ కి వరుస ప్లాపులే పలకరించాయి..ఒకానొక సమయంలో పవన్ కల్యాణ్ సినిమాలను వదిలేస్తే మంచిదని చాలామంది అన్నారు.. కానీ అప్పుడు వచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్..2012 లో యాక్షన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి ఘన విజయం అందుకుందో తెలిసిన విషయమే. పవన్ డైలాగులు, దేవీ శ్రీ ప్రసాద్ పాటలు, శ్రుతి హాసన్ అందం..
ఇలా వినోదాల విందు అందించారు హరీశ్ శంకర్. స్వతహాగా ఆయన పవన్ అభిమాని కావడంతో మరో అడుగుముందుకేసి పవన్ కల్యాణ్‌లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అంతేనా గబ్బర్ సింగ్లా తనూ కనిపించి.. పవన్ కల్యాణే అనుకునేంతగా మాయ చేశారు. 'గబ్బర్ సింగ్' విడుదలై 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ విశేషం చూద్దాం...తమ చిత్రాల్లో అప్పుడప్పుడూ దర్శకులు మెరవడం సహజమే. వాళ్లని కొందరు ప్రేక్షకులు మాత్రమే గుర్తిస్తుంటారు. హరీశ్ శంకర్ విషయంలోనూ ఇంతే. ఎందుకంటే ఆయన తెరపై దర్శనమిచ్చేది 1 సెకను మాత్రమే. ఈ సినిమా ద్వితీయార్థంలో వచ్చే ఐటెమ్ సాంగ్ 'కెవ్వు కేక' తర్వాత ప్రతినాయకుడితో పవన్ చిన్న సంభాషణ సాగిస్తారు.
వెంటనే దానికి సంబంధించిన విజువల్ ప్లే అవుతుంది. ఆ సన్నివేశంలో తొలుత పోలీసు అధికారిగా కనిపించేది హరీశ్ శంకరే. వెంటనే 'గబ్బర్ సింగ్ టోల్ గేట్' అనే బోర్డు పడుతుంది. తర్వాత సీన్ నుంచి పవన్ కనిపిస్తారు..ఇప్పటివరకు సినిమాలో ఈ సీన్ ని ఎవ్వరూ గుర్తించక పోవడం విశేషం.. ఇక తాజాగా ఈ విషయం తెలియడంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ సీన్ ని రిపీట్ మోడ్ లో చూస్తున్నారట..ఇక తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది..!!