పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన మూవీ 'వకీల్ సాబ్'..వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు,బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు.. సినిమాలో నివేదా థామస్,అంజలి, అనన్య కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది..ఇక గత నెల ఏప్రిల్ 9 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుందో తెలియంది కాదు. రీసెంట్‌గా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ చిత్రం ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది.
ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ.. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమాను చూసిన చాలామంది సెలెబ్రిటీలు పవన్ పెర్ఫార్మన్స్ పై ప్రశంసలు కురిపించారు.. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని చూసినట్లుగా తెలుస్తుంది.'వకీల్‌సాబ్' చిత్రాన్ని చూసిన కలెక్షన్ కింగ్.. చిత్రంపై, అందులో నటించిన నటీనటులపై ప్రశంసలు కురిపించినట్లుగా సమాచారం. ముఖ్యంగా పవన్ కల్యాణ్ నటనకు ఆయన ముగ్ధుడయ్యాడని..ఇంత మంచి చిత్రాన్ని తీసిన, నిర్మించిన దర్శక నిర్మాతలు అభినందనీయులని ఆయన అన్నట్లుగా తెలుస్తుంది.
స్త్రీ గొప్పతనం తెలిపే ఇలాంటి..
మంచి మెసేజ్ ఉన్న సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. మోహన్ బాబు 'వకీల్ సాబ్'కు కితాబు ఇచ్చినట్లుగా ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. నటుడిగా, నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన కలెక్షన్ కింగ్..దాసరి వంటి అగ్ర దర్శకుల నుంచి పరిపూర్ణనటుడని అనిపించుకున్నారు. అలాంటి మోహన్ బాబు, ఓ సినిమా గురించి ఇంత పాజిటివ్‌గా మాట్లాడటం ఈ మధ్య కాలంలో అయితే జరగలేదు..అలాంటిది వకీల్ సాబ్ సినిమా గురించి..అందులోనూ పవన్ పెర్ఫార్మన్స్ గురించి ఓ రేంజ్ లో పొగిడాడంటే..మన కలెక్షన్ కింగ్ కి ఈ సినిమా ఎంతలా నచ్చేసిందో అర్ధమవుతుంది..!!