ప్రభాస్, చిరు.. ఫోటో లో ఉన్న ఈ కాంబో నిజమైతే బాగుండు..!!
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. ఇకపోతే చిరు ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ సినిమా తరువాత మరో మూడు సినిమాలను చిరంజీవి ఒప్పుకొని యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత మోహన్ దర్శకత్వంలో రీమేక్ సినిమాని చిరంజీవి చేస్తుండగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా, బాబీ దర్శకత్వంలో ఇంకో సినిమా చిరంజీవి చేస్తున్నారు..
ఇకపోతే ప్రభాస్ రాధే శ్యామ్ , సలార్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే. రాధే శ్యామ్ ఈ జులై లో విడుదల అవుతుండగా సలార్ ని దసరా కి ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటుది... బాహుబలి తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండడం విశేషం.. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ చేయబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి..