మన టాలీవుడ్ డైరెక్టర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇవే.. !

Suma Kallamadi
సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కరిది. ఎవరికుండే స్టైల్ వారికి ఉంటుంది. ఎవరి అభిమానులు వారికి ఉంటారు. అలాగే సినిమా హీరోను, అతని బాడీ లాంగ్వేజ్ ను మైండ్ లో పెట్టుకుని అతనికి తగ్గా కధ రాసుకుని దాన్ని సినిమా రూపంలో తీయాలంటే అది ఒక్క దర్శకుడు వలన మాత్రమే అవుతుందని చెప్పాలి. అయితే ఒక్కోసారి దర్శకులు  తనకంటూ కొన్ని సొంత ఆలోచనలతో కొన్ని కథలు తెరకెక్కిస్తారు.అంతేకాకుండా కొందరు డైరెక్టర్స్ కి కొన్ని ప్రాజెక్టులు కూడా తమ జీవితకాల డ్రీమ్స్ గా ఉంటాయి. ఆ డ్రీమ్స్ పై వాళ్ళు  ఎన్నో ఆశలు కూడా పెట్టుకుంటారు. పలానా హీరోతో వాళ్ళ ప్రాజెక్ట్ తెరకెక్కించాలని అనుకుంటారు. వాటి కోసం ఎంత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా ఇప్పటికి ఎంతో మంది డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్టుల గురించి కలలు కన్నారో చూద్దామా.. !


ముందుగా మన డైరెక్టర్ కృష్ణవంశీ రుద్రాక్ష అనే సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో రమ్యకృష్ణ, అనుష్క, సమంతతో కూడా ప్లాన్ చేశారట కమిటీ మొత్తం బడ్జెట్ వల్ల ఈ సినిమా ఫైనల్ నిర్ణయానికి రాలేకపోయింది.అలాగే బాలకృష్ణతో రైతు కాన్సెప్ట్ లో సినిమా చేయాలనీ అనుకున్నాడు. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ కూడా ఒక కీలక పాత్రలో నటింపచేయాలని అనుకున్నాడు.కానీ కొన్ని కారణాల వలన అమితాబ్ నిరాకరించడంతో ఈ సినిమా కుడా ఆగిపోయింది. ఇకపోతే మన టాలీవుడ్ దర్శక ధీరుడు,  క్రేజీ డైరెక్టర్ రాజమౌళి కు మహాభారతం అనే సినిమా సినిమా తీయాలని ఎప్పటినుంచో ఒక డ్రీమ్ ఉందన్న విషయం తెలిసిందే.కానీ కుదరలేదు. అలాగే గుణశేఖర్ కూడా  తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా అయిన  హిరణ్యకశ్యప అనే సినిమా చేయాలనీ అనుకున్నాడు.  ఈ సినిమా హీరో రానా తో చేయాలని ఫిక్స్ అయ్యాడు కూడా. కానీ ఇప్పటిదాకా సినిమాకి సంబందించిన షూటింగ్ ప్రారంభం అవ్వలేదు.


ఇక మన విభిన్న కధల దర్శకుడు  పూరీ జగన్నాథ్ జనగణమన అనే సినిమా చేయాలనుకున్నాడు.కానీ ఇప్పటి వరకి మళ్లీ ఈ సినిమా అప్ డేట్స్ ఏమి రాలేవు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో కలిసి కోబలి సినిమా చేయాలనుకున్నాడు. కానీ ప్రస్తుతం వేరే సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇక సుకుమార్ మత్స్యకారుల నేపథ్యంలో ఓ సినిమా చేయనున్నాడు.అది కూడా ఎప్పుడు సెట్స్ మీదకి వస్తుందో తెలియదు. ఇక క్రిష్ పర్వ అనే సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తీయాలనుకున్నాడు. కానీ ఎటువంటి అప్ డేట్స్ ఇంకా తెలియదు. ఇకపోతే ఫైనల్ గా మన వివాద స్పద దర్శకుడు  రామ్ గోపాల్ వర్మకి కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందట. అదేంటంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ డీ కంపెనీ అని గతంలో పలుమార్లు తెలపడం.. !! మరి మన స్టార్ డైరెక్టర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ కల ఎప్పటికి నెరవేరేనో వేచి చూద్దాం.. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: