'ఎన్టీఆర్ - కొరటాల' మూవీ నుండి రెండు అప్డేట్లు.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం rrr సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది..ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు తారక్... ఇప్పటికే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది. జూలైలో షూటింగ్ షురూ. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే జనతా గ్యారేజ్‌ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన ఈ కాంబో నెక్ట్స్ అంతకు మించి సక్సెస్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.


జనతా గ్యారేజ్‌ సినిమాలో ఎన్టీఆర్‌ను నేచర్‌ లవర్‌గా ప్రెజెంట్‌ చేసిన కొరటాల, నెక్ట్స్ మూవీలో స్టూడెంట్ లీడర్‌గా చూపించబోతున్నారట.అయితే, ప్రస్తుతం కొరటాల ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు. ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో కొరటాల ఈ సినిమా కథ రాసుకున్నారని..కథా నేపథ్యంలో తెలుగుతనం తేవడానికి పలనాటి ప్రాంతాన్ని తన సినిమా నేపథ్యంగా తీసుకున్నారని టాక్ నడుస్తోంది.అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి సెంటిమెంట్ లేని పర్సన్ లా కనిపించబోతున్నాడట. అంటే తారక్ పాత్ర పూర్తి ఆధ్యాత్మికంగా ఉంటుందని తెలుస్తోంది.


ఇప్పటికే సగం స్క్రిప్ట్ వర్క్ ను కొరటాల దాదాపు పూర్తి చేశారట. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడి ఎవరన్న విషయంలోనూ ఇప్పటికే ఓ న్యూస్‌ వైరల్ అవుతోంది. తారక్‌ జోడిగా బోల్డ్ అండ్ బ్యూటీఫుల్‌ కియారా అద్వానీ నటించబోతున్నారన్నది నయా అప్‌డేట్‌.ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్ విషయంలోనూ మీడియా సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్ రవిచంద్రన్ ఈ క్రేజీ మూవీకి మ్యూజిక్ చేసే ఛాన్స్‌ ఉందన్నది టాలీవుడ్ అప్‌డేట్‌. ఫైనల్‌గా ఇదే కాంబినేషన్‌ సెట్ అయితే ఎక్స్‌పెక్టేషన్స్‌ కూడా మరో లెవల్‌లో ఉంటాయన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు ఫ్యాన్స్‌.ప్రస్తుతం ఈ రెండు అప్డేట్స్ తో ఫుల్ ఖుషీ అవుతున్నారు నందమూరి అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: