పూరీని రిక్వెస్ట్ చేస్తున్న రౌడీ ఫ్యాన్స్ ..?
దీనితో ఫ్యాన్స్ వేయిట్ చేయలేకపోతున్నారట.తాము ఎంతగానో అభిమానించే హీరో విజయ్ లుక్ నైనా కనీసం రివీల్ చేయాలని చిత్ర యూనిట్ ని అభిమానులు డిమాండ్ చేస్తున్నారట.విజయ్ దేవరకొండ ఇప్పటిదాకా ఈ సినిమాలో కూడా నటించలేదు. అంతకముందు రిలీజ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత.. మళ్లీ విజయ్ ఇప్పటివరకు ఆన్ స్క్రీన్ పై కనిపించలేదు.గతేడాది మార్చ్‌లో లైగర్ షూటింగ్ ప్రారంభమైనా గాని ఇప్పటివరకు చిత్రీకరణ పూర్తవలేదు. ఒక పక్క కరోనా వైరస్ కారణంగా ఏడాది కాలంగా సినిమాకి సంబందించిన నిర్మాణ పనులు అన్ని అలానే ఆగిపోయాయి. యాక్షన్ సన్నివేశాల కోసం విదేశీ యాక్షన్ కొరియోగ్రాఫర్‌తో పాటు, ఫైటర్స్ కూడా అవసరం పడటంతో, షూట్ ముందుకు వెళ్లడం లేదు. దీంతో లైగర్ ఎప్పుడొస్తుందనేది ఎవరూ చెప్పడం లేదు.ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా మనకి కనిపించబోతున్నాడు. ఇన్నాళ్లపాటు ఓపిక పట్టిన ఫ్యాన్స్ ఇంకా తమ అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తున్నారు. లైగర్ అప్ డేట్స్ కావాలని పట్టుబడుతున్నారట. కనీసం విజయ్ లుక్ అయినా బయటపెట్టాలని.. డిమాండ్ చేస్తున్నారట. పోస్టర్ లేదా ఓ సాంగ్ అయినా విడుదల చేయాలని చిత్ర బృందాన్ని కోరుతున్నారట.
మరీ అభిమానుల కోరికను పూరీ నెరవేరుస్తాడా ? లేదా ? అనేది చూడాలి. ఇప్పటికి లయన్, టైగర్ క్రాస్ బ్రీడింగ్ అంటూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసినది చిత్ర యూనిట్.ఆ ఒక్క అప్ డేట్ తప్పా ఈ చిత్రానికి సంబందించిన మారె సమాచారం బయటకి రాలేదు. పూరీ సారథ్యంలో చార్మీ, కరణ్ జొహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లైగర్ సినిమాలో విజయ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నే హీరోయిన్ పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో మరొక పవర్ ఫుల్ రోల్ లో ఒకప్పటి హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటించడం విశేషం అనే చెప్పాలి. ఇక బాలీవుడ్ బ్యూటీ అనన్య ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది.