ప్రపంచంపై పగబట్టిన కరోనా రోజురోజుకు శృతిమించుతోంది. కేసులు లక్షల్లో నమోదవుతూ ప్రజానీకాన్ని భయపెడుతున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే కర్ఫ్యూ అమలుచేశారు. తాజాగా ఏపీ కూడా మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ విధించింది. మరోవైపు దేశాన్ని ముంచెత్తుతున్న కరోనా ఎవరినీ వదలడం లేదు. దీని వేగానికి బ్రేకులు వేసేందుకే పలు ప్రభుత్వాలు రంగంలోకి దిగి కర్ఫ్యూ బాట పట్టారు. మరోవైపు బడా కుబేరులు సైతం ఈ వైరస్ దాటికి తట్టుకోలేక నగరాలు వీడి వెళుతున్నారు. ఇండస్ట్రీ పై కూడా కోవిడ్ వేటు పడుతోంది. కరోనా బారిన పడుతున్న సినీ సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా చిన్న పొరపాటుతో కరోనా చేతికి చిక్కిపోతున్నారు.
దీంతో ఎంతో మంది సెలబ్రిటీలు వారి లైఫ్ హ్యాబిట్స్ మార్చుకుంటున్నారు.
బయట వారిని ఇంట్లోకి రానీకుండా.. వారి ఇంటి పనులు వారే చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతే కాదు ఈ కరోనా పీరియడ్ లో పోషక ఆహారం కీలకమైన విషయం అని తెలిసిందే. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు ఎప్పటి నుండో ఫాలో అవుతున్న వారి డైట్ చార్ట్ లను పక్కనపెట్టి బలమైన ఆహారం తీసుకుంటున్నారట. ఇప్పుడు ఇదే తరహాలో పలువురు సినీ తారలు వారి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటున్నారు. కొందరు కరోనా పాజిటివ్ వచ్చాక ఫుడ్ చార్ట్ మారుస్తుంటే మరికొందరు స్టార్స్ ముందుగానే వ్యాధినిరోధక శక్తిని వేగంగా పెంచుకునేందుకు తగిన ఆహారం తీసుకుంటున్నారట.
ఇలా కరోనా కారణంగా తమ డైట్ లో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు కొందరు నటీనటులు. మరోవైపు మన అభిమాన తారల చిత్రాలు విడుదలకు రెడీ అయినప్పటికీ కరోనా ఎఫెక్ట్ తో వాటి రిలీజ్ కు బ్రేకులు పడిన విషయం తెలిసిందే. ఇలా వారు వీరు అని లేకుండా అందరి జీవితాలను శాసిస్తోంది ఈ మహమ్మారి వైరస్ ఈ కరోనా ఎప్పుడూ ప్రపంచాన్ని వీడుతుందో అని ప్రజలు రోదిస్తున్నారు.