నిద్ర లేస్తున్న ఫ్యాక్షనిస్ట్ బాలయ్య?
ఈ సినిమా పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా రియల్ స్టోరీని బేస్ చేసుకుని తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తాజాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా అలాగే ఫ్యాక్షనిస్ట్ గా రెండు విభిన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అన్నీ బాగుంటే ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.
కానీ కరోనా రెండో దశ నేపథ్యంలో అఖండ షూటింగ్ నెమ్మదిగా జరుగుతోంది. సో ఈ సినిమా షూటింగ్ కూడా లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరో పక్క బాలకృష్ణ కళ్యాణ్ రామ్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారనే ప్రచారం తాజాగా మొదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వీరిద్దరితో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఉగాది సందర్భంగా విడుదలైన అఖండ సినిమా టీజర్ ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ సాధించి మరిన్ని వ్యూస్ దిశగా పరుగులు పెడుతోంది.