అమ్మో.. 'అనిల్ జీల' పెళ్లి పత్రిక గింత వెరైటీగుదేందీ..?
మై విలేజ్ షో లో తనదైన నటనతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకునీ తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరయ్యాడు అనిల్ జీల. అయితే మై విలేజ్ షో ఏది చేసినా కూడా సరి కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. కేవలం షార్ట్ ఫిలిమ్స్ విషయంలోనే కాదు తమ నిజ జీవిత విషయాలను కూడా ఎంతో వినూత్నంగా అందరికి తెలియజేస్తూ ఉంటారు మై విలేజ్ షో నటులు. గతంలో మై విలేజ్ షో లో నటిస్తున్న చందు పెళ్లి సందర్భంగా వినూత్న రీతిలో పెళ్లి కార్డు ప్రింట్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
పెళ్లి కార్డు ఇలా కూడా ప్రింట్ చేయిస్తారా అని అందరూ అవాక్కయ్యారు. ప్రస్తుతం అనిల్ జిల పెళ్లి కార్డు కాస్త వైరల్ గా మారిపోయింది. కరోనా వైరస్ పెరిగిపోతుంటే పెళ్లి చేసుకుంటున్న అనిల్ జీల. ఇక దీనికి తగ్గట్లుగానే పెళ్లి కార్డు సిద్ధం చేశాడు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి కరోనా నెగిటివ్ అంటూ ప్రింట్ చేశాడు. కరోనా వైరస్ కారణంగా బంధుమిత్రులు ఎవరు లేకుండా పెళ్లి చేసుకుంటున్నా.. ఇంస్టాగ్రామ్ లో అందరూ లగ్గం చూడొచ్చు అంటూ ప్రింట్ చేసాడు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కట్నాలు చదివించేందుకు గూగుల్ పే ఫోన్ పే స్కానర్ కూడా ఇచ్చాడు. ఇక ఈ పెళ్లి పత్రిక అందరి ముఖాల్లో చిరునవ్వులు విరిసేలా చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.