14 ఏళ్ళు పూర్తి చేసుకున్న వెంకటేష్ 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే'....
ఇప్పటికి కూడా ఈ సినిమా పాటలు ఆకట్టుకుంటూనే వున్నాయి.ఇక ఈ సినిమాకి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. ఎంతో అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించాడు. ఇక 2007 వ సంవత్సరం ఏప్రిల్ 27 న విడుదలైన ఈ చిత్రానికి మొదట మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తరువాత బాగానే పికప్ అయ్యి.. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మ రధం పట్టారు.ఇక ఈ రోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 14 ఏళ్ళు కావస్తోంది.ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే...'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రానికి రూ.13.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.10 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్స్ కు రూ.4.3 కోట్ల లాభాలు మిగిలిలింది. మొదటి రోజు టాక్ ని విని సినిమా నష్టాల పాలవుతుందని చిత్ర బృందం కంగారు పడ్డారట. కాని ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడంతో చాలా సంతోషాపడ్డారట.