రేణు దేశాయ్: ఇలాంటి సమయంలో అలాంటి వీడియోలు చూడండి...?

VAMSI
" data-original-embed="">
ప్రస్తుతం దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. రోజు రోజుకు రెట్టింపవుతున్న కేసులు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది అంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో ప్రమాద స్థాయి ఏ మోతాదులో ఉందో అందరికీ అర్థమవుతోంది. దీంతో ప్రతి ఒక్కరిలో తెలియకుండానే కరోనా గురించి ఆలోచన మొదలవుతుంది. ఏ నోట విన్నా కరోనా మాటలే. ఇలా ప్రపంచమంతా కరోనా వార్తలతో నిండిపోయింది. ఈ మధ్య కాలంలో చూస్తే కరోనా బారిన పడిన సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. వారు వీరు అనే తేడా లేకుండా ఈ మహమ్మారి అందరినీ కబళిస్తోంది.

అయితే ఓవైపు ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధులు, మరోవైపు సినీ ప్రముఖులు కరోనా గురించి అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కరోనా గురించి వ్యాఖ్యానించారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే..రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ... తరచూ ఏదో ఒక న్యూస్ తో హాట్ టాపిక్ గా ఉంటారు. ఆసక్తికర విషయాలను తన ఫాలోవర్స్‌తో పంచుకోవడంలో ముందుంటారు రేణు. అయితే తాజాగా ఈమె కరోనా గురించి మాట్లాడుతూ ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందించిన ఈమె ఏమన్నారంటే.. ఇప్పటివరకు దుఃఖాలను  ద్వేషాలను, మోసి... మోసి గాడిదలుగా అయిపోతున్నాము.

మనం ఈ జీవితం పొందింది, ఈ దేహం ఉన్నది కేవలం సమస్యలను మోస్తూ బాధపడటానికి మాత్రమే కాదు... ఎన్ని ఇబ్బందులు ఉన్నా అందులో కూడా ఏదో ఒక మూల సంతోషం దాగి ఉంటుంది. ఆ సంతోషాన్ని గుర్తించి ఆనందంగా బ్రతకాలి. ఇప్పుడు మనమంతా చావుకి, భయానికి మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. భయపడకండి, బాధపడకండి. సమయాన్ని ఆనందంగా గడపండి. మిమ్మల్ని సంతోషపరిచే కామెడీ వీడియోలను చూస్తూ సమాయన్ని గడపండి.  ఎటువంటి కష్టాలు అయినా ఎంతో కాలం ఉండవు...త్వరగానే గడిచిపోతుంది... అదే కాలం యొక్క విశిష్టత. ఏదీ శాశ్వతం కాదు. మీరు అన్ని జాగ్రత్తలు పాటించండి  సురక్షితంగా ఉండండి... అంటూ ప్రజలకు మంచి సందేశాన్ని అందించారు రేణు దేశాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: