ఆ మాటలు వింటుంటే నిద్ర పట్టడం లేదు.. సోను సూద్ ఎమోషనల్ పోస్ట్..?
ఈ క్రమంలోనే ఏకంగా ఎంతో మంది నిరుపేదలు వలస కార్మికుల పాలిట దేవుడిగా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికికూడా తన సహాయ సహకారాలు అందిస్తూ నే ఉన్నాడు. అయితే ఇటీవల సోను సూద్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. కనీసం నిద్ర కూడా పోలేదని అర్ధరాత్రి సమయంలో ఫోన్ రింగ్ అవుతుందని.. అయ్యా మా వాళ్ల ప్రాణాలను కాపాడండి అంటూ దీనమైన గొంతులు వినిపిస్తున్నాయి అంటూ సోను సూద్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అందరం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని కానీ రానున్న రోజుల్లో భవిష్యత్తు బాగుంటుందని అందరం కలిసి కరోనా వైరస్ పై పోరాడాల్సిన అవసరం ఉంది అంటూ సోనూసూద్ చెప్పుకొచ్చాడు.
అయితే దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు ఎక్కువమంది రోగులు ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది రోగులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంతేకాకుండా ప్రస్తుతం కరోనా వైరస్ చికిత్సలో ఎంతో కీలకంగా మారిన రెమిడీసివర్ మందు కొరత కూడా ఏర్పడుతూ ఉండటం తో ఇక ఆక్సిజన్ కొరతతో పాటు రెమిడీసివర్ కొరత కూడా తీర్చాలి అంటూ సోషల్ మీడియా వేదికగా సోనూసూద్ కు రిక్వెస్ట్ లు వెల్లువెత్తుతున్నాయి.