రేవంత్ రెడ్డి అడిగాడు.. మరి మోడీ తీరుస్తారా?
ఐఐఎం కోసం హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు సీఎం తెలిపారు. తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉంది. అవసరమైన అనుమతులు ఇచ్చిన వెంటనే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ స్థాపనతో రాష్ట్ర యువతకు నాణ్యమైన మేనేజ్‌మెంట్ విద్య అందుబాటులోకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ప్రత్యేకంగా లాభపడతారు. రేవంత్ రెడ్డి ఈ విజ్ఞప్తిని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 9 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కూడా సీఎం కోరారు. కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట్, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు కావాలి. ఈ సంస్థలకు అవసరమైన భూమి, ఇతర సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందని హామీ ఇచ్చారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు